పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మే 2014, సోమవారం

Jagadish Yamijala కవిత

అన్వేషణలో కొట్టుమిట్టాడుతున్నా ----------------------------- మౌనం ఎన్నో అర్ధాలను అరటి పండు ఒలిచినంత తేలికగా నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది హెచ్చరికా చేస్తోంది అయినా ఆ అర్దాలన్నింటినీ పెడచెవిన పెట్టి మాటల్ని కుప్పలు తెప్పలుగా కుమ్మరించి ఏరికోరి సమస్యలు సృష్టించుకుని నజ్జుగుజ్జయి పోవడం సర్వసాధారణమైపోయింది అప్పుడు ఎంత గుంజుకున్నా మౌనం అక్కున చేర్చుకుని ఓదార్చడం మాని మరింత మౌనంగా నన్ను చూసి నవ్వడం భరించలేకపోతున్నాను మౌనమూ మాటలూ నడుమ నేనెంత కాలం నన్ను నేను నడిపించుకోవాలో తెలియడం లేదు మౌనమాటల కలయికలో నన్ను నేను మమేకం చేసుకోవడానికి అన్వేషిస్తున్నాను అదేపనిగా ఆ ఘడియల కోసం చూస్తున్నాను నిద్ర లేని రాత్రులే నా తపనకు సాక్ష్యం - యామిజాల జగదీశ్ 12.5.2014 ------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sjdH8u

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి