పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మే 2014, సోమవారం

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Trance | ఒకోసారి ..... ....ఉహు చాలా సార్లు నేనొక బందింపబడ్డ గదిగా మారిపోతాను వెంటాడే జ్ఞాపకాలు , ఆలోచనలు ,వాదనల కి దూరంగా నాలో విరిగి పడ్డ ముక్కలన్ని వాటి వాటి స్లాట్ లలో కుదురుగా సర్దుకుంటూ మరో పరుగు పందెం కి మనస్సు రెడీ అవ్వకుండా అసాధ్యపు పగ్గాలు బిగిస్తూ ** వారగా ఒక మూlల ఇంకా పూర్తిగా మూసుకోని కిటికీ నాలో నేనున్న సంతృప్తికి పడ్డ రంధ్రం లా అపుడపుడు వీచే గాలి కి రక రకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ కొన్ని వెలుతురు చారికలు నా చెంపల మీద రాలుస్తూ కొంత దుమ్ము ని నా మొహం మీద విదిలిస్తూ తట్టుకోలేక దాన్ని కూడా మూసేయాలన్న బలమయిన కోరిక వెర్రి గా గొంతుకలో అణచుకోలేని కేకలా అసహనంగా వినిపిస్తూ ** కొన్నిసార్లు లోపలి జారి పడే వెలుతురు కణాల ని తదేకంగా చూస్తూ శ్రద్ధగా చాల శ్రద్ధగా ధ్యానమో పరధ్యానమో ఒడిసిపట్టుకోలేని వివశత్వమో ఆవహిసున్నట్లు కాంతి రేఖల్లో కనిపించని నిజాలని అన్వేషించే ప్రక్రియ లో తేలకుండా మునిగిపోతూ ** ఇంకొన్ని సార్లు అపుడే వచ్చి వాలిన పిట్టల రెక్కల చప్పుడు పక్కనే పేలే బాణాసంచా లా బిగ్గరగా చెవిలో గుసగుసలాడుతుంటే బెదిరిపోతూ ఉలిక్కి పడుతూ ** అపుడపుడు రాలిపడే కొన్ని చినుకులు వాంఛల వేడి మీద ఇగిరిపోయిన పొగమంచుల్లా ఆవిరి అయిపోతూ హృదయాన్ని తాకని తడిలా ** విభ్రాంతిగా అనుభూతులని జీవించాలా ? జీవితమే పెద్ద అనుభూతా ? రౌండ్ అప్ చేసే కన్ఫ్యూజన్ లో అనుభూతులు నిస్సారమై అనుభవాలే జీవితం గా మిగిలిపోతాయా ? ** ఎదో మండుతున్న వాసన తల లో మాంసం ముద్ద పూర్తిగా ఉడుకుతున్న వేడి కళ్ళ లోంచి వెచ్చగా కారిపోతూ ఊరటగా !@$... !@# ...!@#$ కొన్ని ఆశుద్ధపు మాటలు పెదవులను స్పర్శిస్తూ ఉపిరితిత్తులకి కొంచం ఊపిరి పోస్తూ , గుండె లో ఖాళీలకు జరిమానా వేస్తూ మెదడులో గుచ్చుకున్న ముల్లు నుండి నెమ్మదిగా తేరుకుంటూ ** టైం ఎంత ? స్వేచ్చని రెండు చెవుల మధ్య నిశ్శబ్దపు శూన్యంలో బందీని చేస్తూ సరిహద్దుల కంచెలలో కి చేరిపోయే సమయం అయిందా ? నిర్లిప్తం గా రేసు లో రెక్కలు లేకుండానే అడుగుపెడుతూ హద్దులు లేని బయటప్రపంచంలోకి తలుపులు తీసే సమయం అపుడే వచ్చేసిందా ? అపుడేనా ? కిటికీ ఇంకా పూర్తిగా మూయనే లేదే? ఇంతలో తలుపులు తెరవాలా ? ఎగ్జిస్టేన్స్ బాధల అసంతృప్తి మెట్లు ఎక్కడం ఇక్కడ నుండే మొదలైపోయాయా ? ** నయా డ్రామా రక్తి కట్టించడానికి తలుపులు తెరుచుకుంటున్నాయి నెమ్మదిగా Its play time dude , Don’t forget to wear u r smile . నిశీ !! 12_05_14 .

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1skdXnU

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి