పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మే 2014, గురువారం

Kavi Yakoob కవిత

యాకూబ్ || కార్డియోగ్రామ్ ------------------------------ అలల మీద, అలల నురగల మీద ఇరుగ్గా ఇంకిపోతుంది ఒక్కో క్షణం. 1 బరువుగా నుదుటిమీంచి జారిన ఆలోచన కుదించుకుపోయి నిస్పృహల బోలుతనం నిండా బహుముఖాలుగా పరుచుకుంటుంది. ఆగిపోయిన శబ్దం, ఆగిపోయిన నవ్వు ఆకలిపువ్వు మీద మంచు- అప్రయత్నంగా మళ్ళీ పుడతాయి. తలుపు కళ్ళద్దాల చూపుల్లోంచి కదిలీ కదలని నీడ కాలు మాత్రం కదుపుతూ కాగితాల అంచుదాకా నడిచొస్తుంది. కొనవేలి మీద కోరికల చిట్టా గునగునా ఉరికొస్తుంది. 2 ఉదయం ఉలిక్కిపడిలేచి కళ్ళమీద చీకటిని నులుముకుంటూ కొత్త తొడుగులు తొడుక్కుని కొబ్బరిచెట్టుమీద కూచుని కోయిలై కూస్తుంది. ఒక్కో క్షణాన్ని వాలుకుర్చీమీద వాల్చుకుని అటూఇటూ ఊగుతూ అదో మాదిరిగా గాలి విసుర్లమీద ; దండెం మీద వేలాడుతున్న పంట్లాం మీద చూపుల్ని ఆరేసుకుని అర్ధాంతరంగా రాలిన చిరునవ్వుల్ని విసిరిన చేతి విసుర్లని, తడిమిన పుస్తకాల పేజీల్ని ఆప్యాయంగా తట్టిన కలల్నీ బెంచీలమీద మీద నిలబెట్టి మళ్ళీ బట్టీయం పట్టించుకుంటుంది మనసు. 3 ప్రతి నిట్టూర్పూ మనసు టి.వి .ఎంటేన్నామీద గబ్బిలంలా వేలాడుతుంది. అరచేతిలో ఆగిపోయిన అక్షరం మాత్రం కళ్ళు చికిలిస్తూ ;అపుడపుడూ కవిత్వమై జారిపోతుంటుంది. # *పాతవాచకం : ప్రవహించే జ్ఞాపకం నుంచి : 29.5.1989

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SCtqFp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి