పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మే 2014, గురువారం

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//మరకమంచిదేనా//02... ఔనూ మరక మంచిదేనా... నీ చూపుడు వేలిపైన ధవళవర్ణపుగోరు హద్దునుదాటి గోధుమవర్ణపు చర్మాన్నికలుపుతూ కాశ్మీర్ లోని చొరబాటుపాకిస్థాన్ సైనికుడిలా అడ్డంగా చొచ్చుకువచ్చి తిష్ఠవేసిన ఆమరక మంచిదేనా? ఔను మరక మంచిదే ! మర్యాదరామన్నతీర్పులా విచక్షణ విజ్ఞతలను మేళవించి ప్రపంచసుందరి అంత అందమైన నిర్ణయమైతే ఆ మరక బ్యూటీస్పాట్ లా నిగనిగలాడుతూంటుంది కానీ నిన్ను ఓ విష్ణుమూర్తి అవతారంలాభావించి, ఆ చూపుడువేలితో చిద్విలాసంగా బ్రహ్మాండాన్నిశాసిస్తావ. వని, శతకోటి ఆశలతో అనంతకోటి అంచనాలతో సుదర్శన ఓటుచక్రాన్ని నీకప్పగిస్తే, ప్రలోభాల గడప తాకి కొరగాని నాలుగుపచ్చనోట్లకే కళ్ళుతేలేసి మైకం కమ్మేసి లక్ష్యాన్ని మరిచేసి బొక్క బోర్లాపడ్డావంటే నా పిచ్చిగాని, ఆ మరక మంచిదెలా అవుతుంది? ఇంతకూ ఆ మరక మంచిదా? ఆ మరక కొంపముంచేదా? 08/05/2014

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m03iP7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి