పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మే 2014, గురువారం

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా.............ఈ భాష నాకొద్దు సార్.... ...................................................... . నా ఆవేదనే0టో మా అమ్మకు అర్థం కాదు మా పిల్లికి పెరట్లో చెట్టుకి మా పొలానికి అర్థం కాన్నప్పుడు ,నన్ను వాటి ము0దు పిచ్చోడిగా నిలపెట్టే భాష నాకె0దుకు అ0దులో అది నా శత్రు భాష నా చీరను నిర్థాక్షణ్యంగా నెట్టేసి స్కర్ట్ను ధరి0చేలా చేసిన భాష మా అన్నయ్యను అమెరికా ఎగిరిపోయేలా చేసిన భాష సవితి భాష పంచాయితి భాష నా సంస్కృతిని దండిగా దొబ్బి తిని బలిచిన భాష కోడి కూతను దూరం చేసిన అలారం భాష. ఉగ్గు పాలను దూరం చేసిన రెడిమెడ్ సిసా పాల భాష. ఈ 26 అక్షరాల రంగుల రంకుల రాట్నం భాష నాకె0దుకు సర్.... నా మాతృ భాష వడిలో శాశ్వత నిద్రపోతా... 08-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m2pg3X

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి