పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మే 2014, శుక్రవారం

Krishna Mani కవిత

దుమ్ము ******** గాలి కెరటాలపై నాట్యమాడు వయ్యారిని నీటి జల్లు తగిలితే జారిపడు సింగారిని దూదిపింజ లాగ తేలిపోదు గగనానికి కిటికీ సందు చాలు ఇల్లంతా పరుచుకుంటా రోడ్డు ఎక్కి చూడు ఒళ్ళంతా అంటుకుంటా తెల్లారగా తెలుస్తుంది కళ్ళ ఊసులై కనిపిస్తా తేమ ఉన్న చోట అడుగు చేరి కూర్చుంటా ఎండ ఉన్న చోట బొబ్బిలినై నిలబడతా ! నాలో కలిసెను మంచివీ చెడ్డవి పాలు నీళ్ళలా వేరు చెయ్యగలవా హంసలాగ ? చేసిన చెడుని మింగక తప్పదు విషంలాగ ! గాలితో సహవాసం అదే కదా నా గమనం ! కృష్ణ మణి ! 02-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R5WUKE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి