పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మే 2014, శుక్రవారం

Amma Akhil కవిత

నిప్పులాంటి నిజం #అమ్మఅఖిల్ ఇక్కడ మనుషులు మనుషులుగా కాక Machinesలాగా బ్రతుకుతున్నారు ఇక జాలి,దయ,కరుణ ఎక్కడి నుండి వస్తాయి మానవ జీవనానికి మానవత్వమనే సహజ లక్షణం ఉంటుంది బ్రతుకంతా యాంత్రికజీవనమైపోయాక మానవత్వమనే గుణం మచ్చుకైనా ఎక్కడ కనపడుతుంది యంత్రాలతో ప్రేమలో పడి ఈ మనుషులు కూడా మనసులేని మరమనుషులుగా మారుతుంటే నెత్తి నోరు కొట్టుకోవడం తప్ప చేసేదేమి లేదు కొన్ని గ్లిజరిన్ కన్నీళ్ళు కార్చడం తప్ప...! ఈ కన్నులతో ఇంకెన్నో మారణకాండలు, మరెన్నో మానభంగాలు ఇంకా కొన్ని నరహత్యలు చూడాల్సిందే... ఇలాంటి దారుణ సంఘటనల నడుమ కొందరు ఎదురుతిరిగితే అధికారబలంతో అణగద్రొక్కే వారేందరో... ఓ భరతమాత నీ కన్నీళ్ళకి కరిగే లోకులు ఏనాడో చచ్చిపోయారు నువ్వు గుండెలు పగిలేలా రోదించినా పట్టించుకునే పాపాన పోయిన నాథులు లేరు మనసారా కోరుకుంటున్న ఇకనైన నీ శోకానికి తెరపడాలని ప్లాస్టిక్ నవ్వులు కాకుండా నీ పెదాలపై నిండైన చిరునవ్వులు పూయాలని... 02may14

by Amma Akhil



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mjWb6I

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి