పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Krishna Mani కవిత

సుక్క బొట్టు ************* మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! పగిలిన నెర్రలమీద పొక్కిలి పెంకలాయే ఎదురుసూపుల కండ్లళ్ళ నెత్తురు జీరలాయే చెట్లకొమ్మల ఆకలికి ఆకుల అరుపులాయే పసి నవ్వులు మానిన లోకం ముసలిదాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! అడవి జాతర మాని బొందలల్ల నీటిపోరులాయే వలసజీవులకు దిక్కుతోయక పీనుగుల పీకుడాయే సుక్క నీళ్ళకు గద్ద సూపుకు ఎండమావుల నవ్వులాయే బలిసిన దున్నల డొక్కల బొక్కలు బయటికాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! అడవిరాజుల బలముదిగి జింకపిల్లల చెలిమిలాయే నల్లతాసుకు తోవ్వదక్కక కన్నపిల్లలె ఆకలాయే అడుగుజరగని మొసలి కాళ్ళకు గట్టిబురద అడ్డమాయే ఎండగొడుగున గడ్డి ఏర్లకు దూపదీరక తిప్పలాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! కృష్ణ మణి I 15-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1es5YUI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి