పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మార్చి 2014, గురువారం

Aruna Naradabhatla కవిత

నడక _________అరుణ నారదభట్ల ఎందుకా నిరాశ... ఒద్దికగా...విరిసే ప్రతి పువ్వునూ అక్షరమాలగా తీర్చిదిద్దాలని కలగంటాం గానీ ఒక్క పూవు కూడా నీరసించ కూడదని కోరుకోవడం ఎంతవరకు సాధ్యం...! కొత్త పంటను పండించాలని విత్తనాలు చల్లగలం గానీ మొలకెత్తించే సారం భూమిలో కూడా ఉండాలి! నీచేతిలోని ధర్మం మూడు పాదాలా నెగ్గించాక నాలుగోపాదం నీది కానప్పుడు ఏమని క్రమబద్దీకరించగలవు! నదిలోనే జీవితం ... అయినా ఒక్కోసారి చేపకు కూడా దాహం వేస్తుంది... చుట్టూ అల్లుకున్న నీటిని చూసి నిబ్బరంగా ఉంటుంది కానీ నీరుగారిపోతుందా...! అరక్షణం పాటు అడుగు ఆగినంత మాత్రాన కాలం స్తంబించిందంటే ఎలా...ఊపిరి ఆగినట్టుగా! ప్రతి అడుగూ నీడగా రావాలంటే నువ్వెప్పుడూ సూర్యకాంతిలోనే తడవాలి... అందులో మార్పేముంటుందీ... వెలుగు విలువ ఎప్పుడూ చీకటి వల్లే! గాలి కదులుతుందీ...నీరు కదులుతుంది నువ్వూ...నేనూ..తో పాటుగా యావత్ విశ్వమూ కదులుతుంది... ఇక ఈ సమయం ఎంతలో పరుగెడుతుందీ... మరో ప్రస్తానం మొదలవడానికి! 13-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rOkm

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి