పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మార్చి 2014, గురువారం

Kapila Ramkumar కవిత

SELECTED READINGS: కపిల రాంకుమార్||చెలామణి - సుధామ - [చిత్ర గ్రంధి నుండి పే,119] మీరు మునపటిలా లేరు అంటుంది తను/ ఔనేమో అభివ్యక్తం కాకుండానే భార్యను అర్థం చేసుకోమనడం కవిత రాయకుండానే కవిగా గుర్తించమనడమే! స్పర్శ కవిత్వం లాలన కవిత్వం ఓదార్పు కవిత్వం! తన దు:ఖానికి తనను వదిలివేయడమంటే పట్టించుకోకపోవడమే! వనితనైనా, వ్యవస్థనైనా, ప్రేమించడం మానింది ఎప్పుడు కానీ అభిఉవయ్క్తే మందగిస్తుంది! భార్య కానీ, కవిత్వం కానీ! భార్యను పట్టించుకోకున్నా భర్తనే అంటే చెల్లుతుంది కాని..... కవిత్వం రాయకూండా కవినే అంటే.....చెల్లదు! ____________________ (ఆదివారం వార్త 19-2-2006) ____________________ 13.3.2014.... ఉ.11.44

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOLCEc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి