పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మార్చి 2014, గురువారం

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ పాత చొక్కా॥ అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు బస్సెక్కేటప్పుడు తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!! (తే 13/03/2014 దీ 08.09 PM )

by Kumar Varma K K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc5BF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి