పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, జూన్ 2014, ఆదివారం

Rammohan Rao Thummuri కవిత

గీత సినిమా ఆమధ్య రిలీజయ్యింది కాని ఆడలేదు.ఆ సినిమాలో ఓ పాట రాసే అవకాశం ఇచ్చారు దర్శకులు శ్రీ యేలేటి రామారావు గారు. సన్నివేశం చెప్పారు.ఒక దళిత వేదపండితుడికి దేవాలయంలో సన్మానం జరిగిన తరువాత అతని స్పందన పాట రూపం లో రాయమన్నారు. మల్లగుల్లాలు పడుతుంటే మనీషా పంచకం సూచించారు మిత్రుడు నారాయణ గౌడు. దాన్ని పట్టుకోవాడానికి కొంత కష్ట పడాల్సి వచ్చింది. ఆ ప్రేరణతో డైరెక్టరు గారి సూచనల మేరకు పాట తయారయ్యింది.దర్శక నిర్మాతలిద్దరికీ చాలా బాగా నచ్చింది.దాదాపు నా బాణీలోనే రేవతి రాగంలో పాట సెట్ చేశారు సంగీత దర్శకులు పద్మనావ్ గారు. దాన్ని చంద్రతేజగారు పాడారు. సాహిత్యం మీ కోసం ఆదికవి వాల్మీకి విరచితం రామాయణం-ఆరాధనీయం వేదవ్యాసకృతమ్ భారత పురాణం -అతిపూజనీయం గాధిసుతప్రోక్తం గాయత్రిమంత్రం -సంస్తవనీయం మాతంగ హృదయం మమకార నిలయం - బహుశ్లాఘనీయం సూతమాతంగ కైరాత క్షత్రియ మునులు బ్రహ్మతత్వజ్ఞాన సంపన్నకోవిదులు స్మృతిశృతి పురాణేతిహాస కృతి కర్తలై ఇలలోన ఖ్యాతివడసిన మేటి బ్రాహ్మణులు ఛండాలుడైతేమి ద్విజుడైన నేమీ బ్రహ్మమెరిగినవాడె నిజమైన బ్రాహ్మణుడు ఛండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ పంచభూతాత్మకం పార్థివ శరీరం జ్ఞానకర్మేంద్రియాధీన మీ దేహం త్రిగుణ సంజనిత సంవేదనా గేహం మనోబుధ్యహమ్మంథన మాయకలశం పంచవింశతి తత్వ పక్వపరిధులు దాటి జ్ఞాననేత్రాలతో పరతత్వమును గాంచి సకల జీవుల లోన తన్ను తా జూచుకొను నేర్పుగల్గినవాడె నిజమైన బ్రాహ్మణుడు ఛండాలుడైతేమి ద్విజుడైన నేమీ బ్రహ్మమెరిగినవాడె నిజమైన బ్రాహ్మణుడు అంత్యజుడనై పుట్టి ఆర్షవిద్యలు నేర్చి అంతరాత్మ ప్రబోధమ్ముతో జీవించు నా స్వప్నమీనాడు నిజము చేసితివా బ్రహ్మజ్ఞులతొ నన్ను సమము చేసితివా దేవ దేవేశ్వరా సర్వలోకేశ్వరా ప్రణమామి ప్రణమామి పాహి పరమేశ్వరా ప్రణమామి ప్రణమామి పాహి పరమేశ్వరా ప్రణమామి ప్రణమామి పాహి పరమేశ్వరా

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UwAGTO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి