పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మే 2014, శనివారం

Srinivas Vasudev కవిత

"నీకంటూ ఓ గది ఉంటే....?" ఈవారం మన అతిథి : వర్జీనియా వూల్ఫ్ -Virginia Woolf. ------------------------------------------------------------- ఔను మనకంటూ ఓ అన్ని హంగులతో ఓ గదంటూ ఉంటే అదే స్వేచ్ఛకీ నిర్వచనమేమో. ఇక్కడ గదన్నది ఆర్ధిక స్వాతంత్ర్యానికి చిహ్నంగా తీసుకుంటే మనదేశంలో చాలామందికి ఇదొక కల. మరదే స్వేచ్ఛ మనదేశంలో ఎంతమంది స్త్రీలకుందన్నది నిజంగానే మిలియన్ డాలర్ ప్రశ్న. వర్జీనియా కూడా అడిగేదీ అదె. సరె, ఇప్పుడు వర్జీనియా జీవితం గురించి కొంత తెల్సుకుని మళ్ళి ఈ గదికొద్దాం. 1882 జనవరి 25 న ఇంగ్లాండ్ లో జన్మించిన ఈమె ఉమ్మడి కుటుంబంలోనే జీవితంలో చాలా భాగం ఉండాల్సివచ్చింది. ఆమె తండ్రి లెస్లీ స్టీఫెన్, సాహితీవేత్త, తల్లి జూలియా లిరువురూ ఇంతకుముందు పెళ్లయి తమ జీవితసహచరులని కోల్పోయి మళ్ళీ పెళ్ళిచేసుకుని తమతమ సంతానాన్ని కూడా వెంటతెచ్చుకున్నారు. అంటే ఒకె ఇంట్లో దాదాపు ఎనిమిదిమంది పిల్లలతో కలిపి పదిమంది వరకూ ఉండేవారన్నమాట. "Your children and my children are fighting with our children" అన్న జోక్ కి ఈ కుటుంబం అతికినట్టు సరిపోతుంది. వర్జీనియాకి ఆరేళ్ల వయసులో తన సవతి అన్నదమ్ముల్లో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడటం, దాంతో కొన్నాళ్ళు మానసిక స్తబ్ధతతలోకి జారుకోవటం ఇవన్నీ వేగంగా జరిగిపోయినా ఆమె కోలుకోవటానికి ఓ జీవితకాలమే పట్టింది. ఇక అప్పట్నుంచీ ఆమె ఒడిదుడుకుల్లోంచి బయటపడి ఓ వ్యక్తికి,, ముఖ్యంగా స్త్రీకి ఆర్ధిక స్వేచ్చ ఎంత అవసరమో చెప్పేవిధంగా తన రచనలు చేయసాగింది. (దాదాపు ఇదంతా గతకొన్ని వారాలుగా రాస్తున్నారు కదా మళ్ళీ ఇదెవరు అని ఆశ్చర్యపోకండీ--మాయా యాంజిలౌ, సిల్వియా ప్లాత్, ఎమిలీ డికిన్సన్ ఇలా నేను ఉదహరించిన రచయిత్రుల జీవితాలన్నీ ఇలానే ఓ సారూప్యతని కలిగి ఉండటం నాకూ ఆశ్చర్యంగానే ఉంది మరి) 1908 లో మొదలుపెట్టిన ఆమె మొదటి నవల (The Voyage Out) పూర్తికావటానికి ఐదేళ్ళ పైనే పట్టిందంటే ఆశ్చర్యమె. ఈ మధ్యకాలంలో ఆమె మళ్ళీ మానసిక దౌర్బల్యానికి గురికావటం (అది అకారణమే అయినా) పెద్ద కారణం. తన రెండో నవల (Night and Day) ని 1919 లో పూర్తిచేయగలిగింది వర్జీనియా. ఆమె తననెప్పుడూ ఫెమినిస్ట్ అని ప్రకటించుకోకపోయినా ఆ ఇజం తన రచనల్లో స్పష్టంగా కన్పడటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఆమె చూసిన జీవితమే తన రచనలకి పెద్ద సోర్స్. చిన్నప్పట్నుంచీ ఒంటరితనాన్ని ఇష్టపడినా తల్లీ తండ్రీ మధ్యవయస్కులుగానే మరణించటమూ, తప్పనిసరి పరిస్థితుల్లో తన సొంత చెల్లెళ్లతోనూ సవతి అక్కాచెల్లెళ్ళపైనా ఆధారపడాల్సిరావటమూ వర్జీనియాకి ప్లస్ మైనస్సూ కూడా. 1925 లో ఆమె రాసిన మరో నవల Mrs. Dalloway వర్జీనియాకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టి ఆ నవలని చలనచిత్రంగా కూడ మలిచినా ఆమె డెప్రెషన్ కి లోను కావటంలో మార్పులేదు. తరువాత కాలంలో To the Lighthouse in 1927, and The Waves in 1931 ఆమెకి ఆంగ్ల నవలా సాహిత్యంలో తిరుగులేని ప్రఖ్యాతుల్ని సుస్థిరం చేసిపెట్టాయి. 1928 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆమె ఇచ్చిన రెండు ప్రసంగపాఠాలే A Room of One’s Own (1929). స్త్రీలకి కావల్సిన ఆర్ధిక స్వాతంత్ర్యం గురించీ స్త్రీ రచనా వ్యాసంగం గురించి ఆమె ఇచ్చిన ఆ ప్రసంగాలు ప్రపంచాన్ని అప్పట్లో ఎంతలా ప్రభావితం చేసాయంటే ఆమె ఈ రచనని చదవని ఆంగ్ల సాహిత్య విద్యార్ధి లేరంటే అతిశయోక్తి కాదనలేమనేవరకు... ఈ క్రింది లింక్ ద్వారా ఆ పాఠాన్ని ఇక్కడ చదవొచ్చు. http://ift.tt/1nLvMgh ఆమె తన రచనల్లోని కోట్స్ లోని కొన్నింటిని ఇక్కడ మీకోసం: 1.It's not catastrophes, murders, deaths, diseases, that age and kill us; it's the way people look and laugh, and run up the steps of omnibuses. 2. The history of men's opposition to women's emancipation is more interesting perhaps than the story of that emancipation itself. 3. Boredom is the legitimate kingdom of the philanthropic. 4. I want the concentration & the romance, & the words all glued together, fused, glowing: have no time to waste any more on prose. 5. Why are women ... so much more interesting to men than men are to women? 6. One cannot think well, love well, sleep well, if one has not dined well. 7. My own brain is to me the most unaccountable of machinery—always buzzing, humming, soaring roaring diving, and then buried in mud. And why? What's this passion for? 8. If one could be friendly with women, what a pleasure—the relationship so secret and private compared with relations with men. Why not write about it truthfully? 9. The eyes of others our prisons; their thoughts our cages. చివరిగా ఆమె తన మిత్రురాలికి రాసిన ఓ ఉత్తరంలో మగాళ్ల గురించి ఓ సలహా: 10. Look here Vita — throw over your man, and we’ll go to Hampton Court and dine on the river together and walk in the garden in the moonlight and come home late and have a bottle of wine and get tipsy, and I’ll tell you all the things I have in my head, millions, myriads — They won’t stir by day, only by dark on the river. Think of that. Throw over your man, I say, and come.”

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o7wOla

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి