పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మే 2014, శనివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ------------ఓ కాలేయం వ్యధ అవును ప్రతిరోజూ నాకు కాలకూట విషంతో అభిషేకిస్తుంటాడు నా యజమాని రాత్రి,పగలు,సమయం,సందర్భంతో పనిలేదు కావలసింది పతనమయ్యే చిన్నకోరిక మాత్రమే దురద్రుష్టం వెంట తెచ్చుకోవటం కాకపోతే ఏంటి ? వాడితో కలిసి నేను పుట్టటం , వాడి ఇష్టానికి నేను బలి కావటం చావైనా ,పుట్టుకైనా సరే మద్యంతోనే సంబరమట స్వర్గసుఖాలు నిషా మత్తులోనేనట ఒక ఊపిరి పుడుతుంది వీడు సారాసీసా పట్టుకుని వేసే గంతులకు అంతే ఉండదు నన్ను నిండా ముంచేసి "ఉబ్బి"తబ్బిబ్బు చేస్తుంటాడు ఇంట్లో ఓ శవం లేస్తుంది భాదంటాడు సారాతోనే విరుగుదంటాడు నా భాదేంటో మరుస్తాడు పోటీ పడుతుంటాడు పెగ్గులతో , ఫ్రెండ్స్ తో తూలి తూలి పడుతుంటాడు వాడి సరదాకు కోలుకోలేనంతగా కుళ్ళిపోతుంటాను నేను విషానికి మరో విషం కలుపుతుంటాడు చల్లగా ,మెల్లగా కోరుక్కుతింటాది ఆ శీతలపానీయం మింగి మింగి వొరిసిపోతుంటాది కాలేయం ఒక్కోసారి జీవనదిలా తడారనివ్వడు గొంతునూ నన్నూ తడుపుతూనేవుంటాడు గొంతు చించుకుని అరవాలనుకుంటాను కానీ నా గొంతెక్కడ పెగులుతాది ? గొంతునిండా మందుతో నింపేసాడు కదా ! 31-05-2014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pGK5lD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి