పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మే 2014, శుక్రవారం

Ravela Purushothama Rao కవిత

గాయాల చెట్లు. -----------------రావెల పురుషోత్తమ రావు. యు వత గుండెలు పిండేలా నాలుగుబజార్ల కూడలిలో ఊర్ధ్వ దిశగా వేలాడుతూ ఊపిరాడనివ్వకుండా కండల పెండేరాన్ని ప్రదర్శించే పీల కధానాయకుడు. నూలుతాడు బరువును సైతం భరించడం నా వల్ల కాదన్నట్లుగా ఆందాల ఆరబోతలో అగ్రశ్రేణి నధిరోహించి కన్నుల విందుకు రా! రమ్మన్నట్లుగా హొయలొలకబోసే అర్ధనగ్న సుందరి నేటిమేటి కధానాయిక. త్రిభాషా సుత్రానికి కట్టుబడి మూడు భాషల్లోని తిట్లనూ కదంబంలా కలిపికుట్తి పాటగా అల్లి ప్రజలచెత్తహోరెత్తించుతూ జ్ఞాతుల గడపలన్నింటా ఎక్కి దిగ్గి సిఫార్సుల చట్రంలో చిక్కుకుపోయిన చిత్ర విచిత్ర గీత రచయిత. కొన్ని వందలకోట్ల పెట్టుబడితో యేడాదిపొడుగునా విదేశీ లొకేషన్సులలో నిర్మితమై కక్షలూ కావేషాల నేపధ్యం గీసిన గిరిదాటలేక సినిమాలో తిరగబడే సుమోల్లా ప్రేక్షకుల అనాదరణకు గురై తిరుగు తపాలో డబ్బాల్లో పంపిణీ సన్oస్థ వాకిట్లో వాలిపోతున్న వందలాది మూస తెలుగు సినీ చిత్రాలు. ఇవoడీ మన సంస్కృతీ సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు మంటగలపడంలో బహుధా ఆరితేరిన కధలూ కాకరకాయల కమామిషులూ బాధామయ గాధల గాయాల చెట్లు. 15-5-14 ===============================

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k5VVF2

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి