పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మే 2014, శుక్రవారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

@ చిన్ని @ // సాగిపోతున్నాను // ========================= పేదవాడి చితి మంటలు రేగుతుంటే కులగజ్జి చాపకింద నీరులా మెల్లగా సాగిపోతుంది తోటివాడు మద్య తరగతి జీవితాలతో మదన పడుతుంటే మత పిచ్చి తుమ్మ ముల్లులా బ్రతుకులో గ్రుచ్చ్చుకుంటుంది దట్టమైన పొగలాంటి వర్గ పిచ్చి పిచ్చిదానిలా పరుగులు తీస్తుంది అన్యాయపు దీవి లాంటి డబ్బు రొచ్చు అసహాయతను వెక్కిరిస్తుంది కనుల ముందు పేదవాడి జీవితం రాలిపోతుంటే కనులుండి చూడలేని గ్రుడ్డివాడిలా బ్రతుకు గమనం సాగిపోతుంది ఆవేశం కట్టలు తెంచుకుని ప్రవాహంలా పరుగులు తీస్తుంటే అయ్యో బ్రతుకు పందెం ఓడిపోయనేమో అని భ్రమ కలుగుతుంది అయినా సరే.... సమాజ జీవచ్చవాలను లెక్కపెట్టుకుంటూ నా గుండెకు అయిన గాయానికి అతుకులు వేసుకుంటూ సల సల మనే నెత్తుటి శబ్దాన్ని నెమరు వేసుకుంటూ ముందుకి సాగిపోతున్నాను...... @ చిన్ని @ // 16-05-2014 MY Heart Beats

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlCQjy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి