పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మే 2014, బుధవారం

Afsar Afsar కవిత

కవిత్వంతో కరచాలనం-7: ~ రాజకీయ కవిత్వం అంటే...ఇదిగో ఇదీ!! ~ అమీరి బరాకా అంటే దట్టించిన ఫిరంగి. అతని కవిత్వంలోని ప్రతీ పంక్తీ వొక రాజకీయ ప్రకటన, వొక ధిక్కార కవితాగ్రహం. ఈ కాలంలో కవిత్వాన్ని అంత బలంగా అంత ఆవేశంగా అంత పొగరుగా రాసిన వాళ్ళు అరుదు. ఇప్పుడు మీరు చదవబోతున్న కవిత అమీరి బరాక అంటే ఏమిటో బలంగా చెబుతుంది. వొక కవి గట్టిగా నిలబడి స్పష్టంగా గొంతు విప్పితే అది ఎంత రాజుకొని నలుదిక్కులూ అంటు కుంటాయో అనుభవంలోకి తెచ్చిన కవిత ఇది. ఈ కవిత అచ్చయాక అమెరికా కంటి మీద కొన్నాళ్ళు కునుకు కరువయింది. ఇవి ఆ దీర్ఘ కవితలోని కొన్ని పంక్తులు మాత్రమె. 1934 లో అమెరికాలోని న్యూ జర్సీ నూవార్క్ లో పుట్టిన బరాక తన కవిత్వం నిండా విప్లవ గాలులని పోత్తంగా వూదిన వాడు. ఎక్కడ విప్లవాగ్నులు రగిలితే అక్కడికి అతని కవిత్వ వాక్యాలు ప్రయాణించాయి. SOMEBODY BLEW UP AMERICA ఎవరు ఎవరు ఎవరు? వాళ్ళంటారు వొక టెర్రరిస్ట్ అని. ??? ఎవరో వొక అనాగరికుడని. మొత్తానికి ఎవరయితేనేం ఆ పని చేసింది అమెరికన్ టెర్రరిస్టు కాదు, కాస్టూమ్ లో కళకళలాడే గనేరియా కాదు నల్ల జనం గొంతు నులిమిన ఆ తెల్ల తెల్లని మహమ్మారి కాదు కసి దీరా మానవత్వాన్ని ఉగ్రవాదం చేసిన మరేదో మాయల మారి కాదు. ఎవరు ఎవరు అని అడుగుతారు గుచ్చి గుచ్చి వాళ్ళే! * * ఎవరు ఎవరు ఎవరు? వాల్ స్ట్రీట్ మీద తిష్ట వేసిన వాళ్ళు ప్లాంటేషన్ ల కింద నీలోని జీవాన్ని తెగనరికిన వాళ్ళు నీ తల్లి మానాన్ని దోచిన వాళ్ళు నీ తండ్రిని నరికి పోగులు పెట్టిన వాళ్ళు ఎవర్రా వాళ్ళు? ఎవర్రా? * * కలల్ని తొక్కిపెట్టిన వాళ్ళు కళలకి గిరి గీసిన వాళ్ళు శాస్త్రాలని శాసించిన వాళ్ళు బాంబులు చేసిన వాళ్ళు తుపాకుల్ని కన్న వాళ్ళు బానిసల్ని అమ్మిన వాళ్ళూ, కొన్న వాళ్ళూ వాళ్ళకి నానా రకాల పేర్లు పెట్టి హింసించిన వాళ్ళు ఎవర్రా? ఎవర్రా? * * రాజ ప్రాసాదాల వంటి ఇండ్లల్లో వుండే వాళ్ళు నేరాలకు నెలవయిన వాళ్ళు తలచుకున్నదే తడవుగా విహార యాత్రలకి పరిగెత్తే వాళ్ళు నిగ్గర్లని చంపిన వాళ్ళు యూదుల్ని హననం చేసిన వాళ్ళు ఇటాలియన్ల కుత్తుకల్ని కత్తిరించిన వాళ్ళు ఐరిష్ల ఉసురు పోసుకున్న వాళ్ళు ఆఫ్రికన్లని అంతం చేసిన వాళ్ళు లాటినోలనీ, జపనీయులనీ వెంటాడిన వాళ్ళు ఎవర్రా, ఎవర్రా? — సముద్రాల్ని మింగేసిన వాళ్ళు కడు విశాల మాల్స్ లో జల్సాలు చేసే వాళ్ళు టెలివిజన్లని తోడు పెట్టుకున్న వాళ్ళు * * ఎవరు చూసారులే, దేవుణ్ణి! కాని, దెయ్యం మాత్రం ఇప్పుడు అందరికీ కనపడింది. నీ బతుకులోకి నీలోకి నీ ఆత్మలోకి నీ మెదడులోకి పేల్తూ వస్తున్న గుడ్ల గూబలాగా నరకలోకపు అగ్ని కురిపిస్తున్న యాసిడ్ లాగా ఎవరూ? ఎవరూ? ఎవ…ర్రా?! *

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1juapdg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి