పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఫిబ్రవరి 2014, గురువారం

Mohan Ravipati కవిత

మోహన్ || సముద్రాన్ని తాగిన తీరం || ఈ రోజు నా సిరల్లో శిరసులు తెగిపడ్డ శరీరాలు స్రవించే రక్తం పరుగులెడుతుంది నా ధమనుల్లో దమనకాండకు గురైన దరిద్ర నారాయణుల రుధిర ధారలు ప్రవహిస్తున్నాయి. రెండిటిని కలిపి భరించే గుండె కావాలి. ఆ మండే గుండెలు చల్లారేందుకు ఘోష లేని సముద్రాలు కావాలి నాకో నిశ్శబ్దం కావాలి, నా గుండెల్లో మ్రోగే లబ్ డబ్ ల డప్పుల గీతం ప్రపంచమంతా ప్రవహించి , ప్రతి గుండె తో జత కూడి మరో సముద్రాన్ని సృష్టించాలి నాకో తీరం కావాలి. సముద్రాన్ని దశదిశలా విస్తరించే తీరం కావాలి ఇసుక రేణువుల్లో తడినింపుకోగల దాహంతో కూడిన తీరం కావాలి. తీరం దాహం తీర్చి సముద్రాలు ఇంకి పోవాలి ఆ దాహంతీరిన తీరంలో నేను సేదతీరాలి 20/02/2014

by Mohan Ravipati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MEwspp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి