పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఫిబ్రవరి 2014, గురువారం

Nirmalarani Thota కవిత

లిప్త పాటు కళ్ళు మూస్తే చుట్టూ చుట్టేసే చీకటి . . మనసు లోతుల్లోంచి వెల్లువయ్యే నిశి . . తనువంతా పరుచుకొని పొరలు పొరలుగా తడుపుతూ తడుముతూ వెక్కిరిస్తూ వేదనవుతూ వికటాట్టహాసం చేస్తూ ఒక్క క్షణం స్వప్నమై మరు క్షణం శూన్యమై స్థభ్దమై ఒక్క క్షణం నీరవమై నిశ్చలమై నిగూడమై . . . నిర్మలమై ఒక్క క్షణం . . . ఒక్క క్షణం నా ఉనికిని ప్రశ్నిస్తూ పరిహసిస్తూ . . . తాను నిజమై నేను కరిగే నీడై . . కోల్పోయిన నా స్వీయత దూరపు నెలవంకైతే. . నిండిన మసక చీకటిలో అసహనపు దాహార్తిలో . . ఆరుబయట నే రాసుకున్న జాలిపాట విని రాలిన నక్షత్రాల సామీప్యంలా . . . చెదిరిన నది ఒడిలో నిశ్చల నక్షత్రపు ప్రతిబింబంలా . . . కూలిన స్వప్న సౌధాల పునర్నిర్మాణంలో అలసిన బేలగువ్వ లిప్తపాటు సేదకై సారించిన చూపుల్లా . . . నా భావాలు మనసైన మనసున్న మనిషిని చేరితే పొద్దున్నే కలల ముంగిట పూచే గుబాళింపు వనాలు . . వీచే పులకరింపు గీతాలు . . ఎగిసే జలదరింపు సాగరాలు . . కురిసే పలకరింపు జలపాతాలు . . ! ! నిర్మలారాణి తోట [ 20.02.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKkRjq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి