పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఆగస్టు 2012, శుక్రవారం

అమ్మకొడుక ఆలోచించు - కృష్ణ వేణి


అమ్మనై అడుగుతున్న
అమ్మకొడుక ఆలోచించు



రాఖీ గట్టిన చెల్లెకు రక్షణగా నిలబడ్తావ్
మరి రోడ్ మీది చెల్లెనెందుకు రోత కూతలు కుస్తావ్.

పక్క మీంచి లేవంగానే అమ్మ కాళ్ళను కండ్లకద్దుకుంటావ్
మరి పిల్ల నిచ్చిన అమ్మనెందుకు అమ్మ నా బూతులు తిడ్తావ్.

బువ్వ పెట్టె తల్లి బుతల్లంటావ్
మరి నీ పిల్లల తల్లినెందుకు కట్నం కోసం కాల్చుకు తింటావ్.

వాకిట్ల మొల్సిన తులసి చెట్టును ఆడబిడ్డ అని పుజిస్తావ్
మరి నీ కడుపుల పుట్టిన బిడ్డనెందుకు చెత్తబుట్టల పాల్జేస్తావ్.

అపురూపమైనదమ్మ ఆడ జన్మ అంటావ్. అంతలోకే
అందాల ఆడబొమ్మ అంటూ అంగట్ల సరుకును జేస్తావ్.

విలువల వలువలు విప్పేస్తూ అంగాంగ ప్రదర్శన జేపిస్తావ్.
షేవింగ్ క్రీములు, అండర్వేర్ లు, కంపు దేహాలను ఇంపు జేసే అత్తరు సీసాలు అమ్ముకునే వస్తువులన్నీ
మీయే కదా మరి అమ్మ తనన్నేందుకు టి.వి. తెర మీద ఆరేస్తావ్
అమ్మనై అడుగుతున్న అమ్మకొడుక ఆలోచించు..

*15-08-2012

 ·  ·  · Yesterday at 2:37pm

    • Anil Dani ఈమె మన మెంబెర్ నరేష్ వాళ్ళ అక్కగారు
      Yesterday at 2:38pm ·  · 2

    • Padma Sreeram ఓహ్...రియల్లీ ఐ మిస్డ్ ఎ లాట్...
      Yesterday at 2:38pm ·  · 2

    • Anil Dani ఈమె చదివిన కవితకు దాదాపుగా ఒక పదిమంది వరకు వచ్చి ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ లు
      తీసుకున్నారు కొంతమంది బుక్స్ ప్రెజెంట్ చేసారు అభినందనలకు లెక్కేలేదు
      ప్రతీ లైన్ కు చప్పట్లే , వాస్తవికతను కవితలో జోడించి అలరించారు
      Yesterday at 2:44pm ·  · 7

    • Mercy Margaret nijam .. nijam
      Yesterday at 3:16pm ·  · 2

    • Jagathi Dhaathri కృష్ణ వేణీ ఆణిముత్యమా నీ కవితాత్మ ప్రాణ ముత్యమా జాబిలి చలువో నీవు వెన్నెల కలువో మా కవి సంగమాన స్వాతి చినుకువో .....ప్రేమతొ ...జగతి
      Yesterday at 3:27pm ·  · 4

    • Bhavani Phani కృషవేణి గారు చదివిన కవిత పోస్ట్ చెయ్యొచ్చు కదా
      అంత చక్కని కవిత చదవాలని ఉంది
      Yesterday at 3:37pm ·  · 5

    • Anil Dani Bhavani Phani gaaru iam try to get that one may this eveing we will read here
      Yesterday at 3:38pm ·  · 3

    • Anil Dani Bhavani Phani gaaru iam try to get that one may this eveing we will read here
      Yesterday at 3:38pm ·  · 2

    • Bhavani Phani oh k thank u Anil Dani garu

    • Narender Raj G అభినందనలు
      Yesterday at 4:08pm ·  · 1

    • Gurram Seeta Ramulu evariyinaa eeme kavitha post chestaraa..came to know it was a nice piece of writing cold any one please??
      22 hours ago ·  · 5

    • John Hyde Kanumuri i salute the presentation of reading the lines...
      21 hours ago ·  · 4

    • Prav Veen congrats veni
      20 hours ago via mobile · 

    • Raghu Mandaati అమ్మనై అడుగుతున్న
      అమ్మకొడుక ఆలోచించు
      రాఖీ గట్టిన చెల్లెకు రక్షణగా నిలబడ్తావ్
      మరి రోడ్ మీది చెల్లెనెందుకు రోత కూతలు కుస్తావ్.
      పక్క మీంచి లేవంగానే అమ్మ కాళ్ళను కండ్లకద్దుకుంటావ్
      మరి పిల్ల నిచ్చిన అమ్మనెందుకు అమ్మ నా బూతులు తిడ్తావ్.
      బువ్వ పెట్టె తల్లి బుతల్లంటావ్
      మరి నీ పిల్లల తల్లినెందుకు కట్నం కోసం కాల్చుకు తింటావ్.
      వాకిట్ల మొల్సిన తులసి చెట్టును ఆడబిడ్డ అని పుజిస్తావ్
      మరి నీ కడుపుల పుట్టిన బిడ్డనెందుకు చెత్తబుట్టల పాల్జేస్తావ్.
      అపురూపమైనదమ్మ ఆడ జన్మ అంటావ్. అంతలోకే
      అందాల ఆడబొమ్మ అంటూ అంగట్ల సరుకును జేస్తావ్.
      విలువల వలువలు విప్పేస్తూ అంగాంగ ప్రదర్శన జేపిస్తావ్.
      షేవింగ్ క్రీములు, అండర్వేర్ లు, కంపు దేహాలను ఇంపు జేసే అత్తరు సీసాలు అమ్ముకునే వస్తువులన్నీ
      మీయే కదా మరి అమ్మ తనన్నేందుకు టి.వి. తెర మీద ఆరేస్తావ్
      అమ్మనై అడుగుతున్న అమ్మకొడుక ఆలోచించు..
      19 hours ago ·  · 12

    • Raghu Mandaati ఏంటో అల గుర్తుండిపోయింది తనతో పాటు తన కవిత.
      19 hours ago ·  · 4

    • Katta Sudershan Reddy It is a wonderful one with a realistic sense.
      18 hours ago ·  · 1

    • Kiran Gali Krishna Veni gaaru cheppina prati aksharam nagna satyam. Ituvanti kavitvame kaavaali. Even if dozen poems like this come in a year through KaviSangamam on social issues then I believe KaviSangamam would fulfill its purpose and justify its existence.
      17 hours ago ·  · 5

    • Naresh Kumar Thank you Anil Dani bhai..... And all frns akka tarapuna andariki peru peruna dhanyawaadaalu..... :-)
      16 hours ago via mobile ·  · 3

    • Subbarayudu G Kameswara Is Ms. Krishna Veni on FB/Kavi Sangaman, please let's know. She is very invaluable to this group. --Subbu
      16 hours ago ·  · 1

    • Damayanthi Rangavajjala mari, veeri kavita elaa chadavagalam mEmu?

    • Padma Sreeram ఓహ్...గ్రేట్ సోదరీ కృష్ణవేణీ....కృష్ణమ్మలా పాపాలు కడిగినట్లుంది కవిత...

      రఘూ జీ....ధన్యవాదాలు మీట్ కి రాలేని మాకు మీరు పంచిన కృష్ణసరానికి సర్వదా శతధా ధన్యోస్మి...
      about an hour ago ·  · 3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి