పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జులై 2012, శుక్రవారం

కిరణ్ గాలి॥ఇంతేనా?॥


తెరమీద హీరొ, తెలివిలేని ప్రియుడు
పచ్చ గడ్డి పార్కు, లోనెక్ ఆర్కూ
మిల్స్ అండ్ బూన్సు, ఫీట్ట యిన జీన్సు
నైట్ క్లబ్ డాన్సూ, వెంటపడే ఫాన్సూ
నువ్వేనా టీనేజ్ గర్ల్ వి?

ఇస్ట్రీ చొక్కా, సిగరెట్ గుట్కా,
ఈవ్ టిజీన్గు, లైన్లు కటింగు,
బస్టాప్ బ్యూటీ, మిడ్‌నైట్ టీవీ
బార్లు బీర్లు, బైకు మీద బీట్లు
వీడేనా కుర్రాడంటే?

చాలని జీతం, చెదిరిన కలలు,
పెరిగిన అప్పు, నిండు కున్న పప్పు,
కాలు జారిన కూతురు, దారి తప్పి న కొడుకు
కడివెడు కన్నీళ్ళు, దోసెడు నవ్వులు,
మధ్య తరగతి గతీ ఇంతేనా?

చిమ్ని పొగ సైరన్ రొద
చిందిన స్వేదం, ఎండిన డొక్క
డౌన్ డౌన్ లు జిందాబాదులు
తిరిగే యంత్రం, నలిగె చేతులు
వాడెలె కార్మికుడంటె

ఆకలి పాట, తుపాకి తూటా,
ప్రజా కోర్టులు, లాటి దెబ్బలు,
మందు పాతర, లాకప్ డేత్తు
సుత్తి కొడవలి, నెత్తుటి కడలి

ఇంతేనా విప్లవమంటే?

తలపై పిలుక, గుడిలో గంట,
శటగొపాలు, కొబ్బరి తీర్థం,
వేసే దక్షిణ, కోరే కోర్కె,
పూసిన నామం, చేసిన పాపం,

అంతేనా ఆస్తిక మంటే?

మోమున మడతలు, మూ ల్గే పేగులు,
ఎంగిలి ఆకు, మొరిగే కుక్కలు,
ఎండిన రొమ్ములు, ఏడ్చే పిల్లలు,
మురుగు కాలువ, ముసిరె ఈగలు

ఇంతే కదా పేదరిక మంటే?

రేగిన కామం, తీరిన తాపం,
అలిసిన విటుడు, నలిగిన పక్క,
వాడిన మల్లెలు, పగిలిన గాజులు
చిరిగిన నోటు, చితికిన శీలం

అంతేలే వేశ్యల విలువ

నిర్లక్షపు క్షయ, స్వార్ధపు కుష్టు
కుల గజ్జి, మత తామర
దురాశ దురద, దౌర్జన్యం దుర్వాసన
స్టేటస్ కురుపు, అసూయ రసి

సహించలేని సంఘపు దుస్థితి

తోలు తిత్తీ, తొమ్మిది చిల్లులు,
సున్నమ్ నీరు, చీము నెత్తురు,
బొమికలు బొచ్చు, నరాలు నాడులు
మాంసం గుజ్జు, మల మూత్రాలు,

ఇంతే కదా శరీర మంటే

ఆశలు కోర్కెలు, వ్యధలు బాధలు,
నిరాశ నిసృహలు, నైరాష్యం నిర్లిప్తతలు
శోధన రొదనలు, అలజడులు ఆవేదనలు
తర్కాలు తగాదాలు, వైఫల్యాలు విరక్తులు
సందేహాలు, సన్ధిగ్దాలు,
అనుమానాలు అవమానాలు,
ఆరాటాలు, పోరాటాలు

ఇంతేనా జీవత మంటే?
* 12.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి