పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మే 2014, ఆదివారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ ....................... || శూన్యంలో నేను || ======================================= ఆకాశంలో తుర్రు పిట్టలు గుంపులు, గుంపులుగా ఎగిరిపోతున్నాయి నా చూపులు మాత్రం శూన్యం గానే మిగిలిపోతున్నాయి ఎర్రటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి పక్షులు అలసి గూటికి చేరుకుంటున్నాయి నేను మాత్రం గంజి కోసం ఇంకా చూస్తూనే ఉన్నాను ప్రేగులు శబ్దాలు చేస్తున్నాయి ఆకలి మంటతో.. వీధి చివరన గుడ్లగూబ వెకిలిగా అరుస్తోంది తీతువు పిట్ట రెక్కల చప్పుళ్ళతో రెక్కీ నిర్వహిస్తుంది గబ్బిలం గంపెడాశ తో అటూ -ఇటూ తిరుగుతుంది నేను మెతుకుల కోసం శూన్యంలోకి చూస్తూనే ఉన్నాను చీకటి చిత్రంగా తనవైపు రమ్మని కవ్విస్తుంది మచ్చలచందమామ పైనుండి వెక్కిరిస్తోంది అప్పుడప్పుడు మబ్బులు కప్పుకుంటు కనపడకుండా పోతుంది అప్పుడే అక్కడక్కడా వీధి కుక్కలు ఏడుస్తున్నాయి నా దేహం మాత్రం ఇంకా శోదిస్తోంది నైనాలు పెద్దవి చేస్తూ- ప్రకృతి ఆనవాళ్ళు మాత్రం భయ పెడుతున్నాయి తర తరాలుగా మారని దోపిడీ నర నరాలును పిండేస్తుంది జన్మ వృత్తాతంలో ఎన్నో మజిలీలు నీడలా వెంటాడుతున్నాయి ఆకలి తీరని కడుపులు పేగులు మడిచి డొక్కలో మోకాళ్ళు ముడుచుకుని ఆకలి తీర్చు కుంటున్నాయి ఎన్నో రాత్రులు కళ్ళముందు ఒంటరిగా వెళ్ళిపోతున్నాయి నేను మాత్రం పగలూ ... రాత్రి ... శూన్యాన్నే చూస్తున్నాను ఇప్పుడే కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి ------------------------------------------------- మే 18/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHhJI8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి