పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//కుటుంబం//09 ****************** అయ్యగారిది డబ్బుప్రపంచం అమ్మగారిది సీరియళ్ళప్రపంచం పెద్దాడిదీ బైక్ ప్రపంచం చిన్నదానిది సెల్లు ప్రపంచం ఎవరి ప్రపంచం వారిది ఎవరి వెతుకులాట ఎవరి వెతుకులాటవారిది ఎవరికెవరిపై అపేక్షలు సొంతవారిపైన ఉపేక్షలు ఏంతింటున్నారు? ఎలాచదువుతున్నారు? ఎక్కడతిరుగుతున్నారు? ఏమేం చేస్తున్నారు? తెలుసుకునే తీరిక ఏది ఆరాతీసే ఓపిక ఎక్కడిది మేమంతాకలిసి భోంచేసి ఎన్నాళ్ళయిందో?అంటూ తామెంతబిజీయో అన్నట్టు తమపనులు ఆగితే ఆకాశమే కూలి నేలపై పడుతుందేమో అన్నంత హైరానాలు ఆధునికపోకడల ముఖచిత్రచిత్రాలు ఆత్మబంధాలమధ్య పెరుతున్నఅగాధాలు బాధ్యతలు పట్టని విషాధాలు నేతిబీరలో నెయ్యిలా కుటుంబంలోనే కుటుంబ భావనలు విలుప్తమవుతూంటే ఇక వసుధైక కుటుంబభావనలు ఎలాగ సాధ్యమవుతాయి 15-5-2014 (నేడు అంతర్జాతీయ కుటుంబదినోత్సవం)సందర్భంగా శుభాకాంక్షలతో......

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liHH1P

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి