పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

Rajender Kalluri కవిత

## అమర్ రహే ## ఆ క్షణాలు నన్ను చేసాయి " అమరుడు " ని మనస్సేన్దుకో మరణం వైపు మళ్లించిన ఆ క్షణాలు మల్లి తిరిగిరాను అని తెలిసి బాధపడ్డ గడియలు తెలిసో తేలికో చేసిన పొరపాటు వల్ల కళాశాలలోని పరీక్షలో ఫెలు అయ్యాను ...... అంతే ! నీ జీవితం వృధా అన్నారు కొందఱు , నీ వల్ల కాదు అన్నారు ఇంకొందరు , ఈ జన్మ వ్యర్ధం అన్నారు మరికొందరు .... మనస్సేన్దుకో నోచ్చేసుకుంది , గుండెను గుచ్చేసుకుంది . ముద్ద నోట్లో పెట్టె అమ్మ కుడా నన్ను మొద్దు అనేసింది , నన్ను రెచ్చగొట్టే నాన్న వొద్దు అనిపించింది హేళన చేసే స్నేహితులనా నేను సంపాదించుకుంది అనిపించింది వద్దని వారించుకునె ఇద్దరు ఒక మనిషిలో ఎలా ఉంటారో అప్పుడర్ధమైంది మరణం మంచిది కాదని తెలుసు , ఐనా ఆ క్షనాలేన్దుకో నన్ను చావు వెనకాల పరుగులు పెట్టిన్చాయ్ అందరు కాదని నేను వెళ్ళిపోయినా నన్నెవరు కాదనలేదు అన్న వాస్తవాన్ని మర్చిపోయినా , నాలుగు కాళ్ళు నా వెంట వచ్చి శవాన్ని కాటికి చేర్చాయి రాసిన పరీక్షలో విఫలమయ్యాను అనుకున్నా నిజానికి ......ఆ దేవుడు పెట్టిన పరీక్షకు బయపడి చచ్చిపోయి కుడా విఫలమయ్యాను నేను మరణించినా నా ప్రశ్న బ్రతికే ఉంది ..ఇంతకూ ఈ సమాజంలో “ ఓటమంటే అంత చిన్న చూపేందుకు .....గెలుపంటే అంతే మోజేందుకు ? పడి లేచే కెరటాల వల్లనె కదా ప్రపంచం మొత్తం వెలుగులతో నిండిపోతుంది ....జీవితం కుడా అంతే ! “ సాదక బాధకాలుంటేనే " మనిషి " , వాటికి బయపడి చావు అనే కౌగిలి చేరోద్దని మీ kAlluRi [ 15-05-2014 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sQaaRl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి