పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఏప్రిల్ 2014, గురువారం

Renuka Ayola కవిత

// నీడలోపలిదేహం// రేణుక అయోల దీపం కింద నీడ దేహన్ని చాపలా పరుచుకుని కూర్చునట్లుగావుంది వెలుగు రెక్కలు జీవితాన్ని కాగబెడుతునట్లుగా వుంది మనసు జ్వాలతోపాటూ ఊగుతోంది కారణం లేకుండానే ఆశల రెక్కలు ఎగిరివచ్చి దీపాన్ని కౌగలించుకుంటున్నాయి మండుతున్న ఎరుపులో జారిపడిపోతూ లేస్తూ దీపం కింద నీడని వంగి చుస్తున్నాయి జవాబు రాని ప్రశ్నలా దీపం కొండేక్కుతోంది మునివేళ్లతో సవరించి నుసినిరాల్చి దీపాన్ని వెలిగించినప్పుడు అప్పుడు కూడా గాలి స్పర్శలో ఊగే దీపం ఆత్మలా మండుతోంది జీవితాన్ని వెలిగించాలన్న వెర్రికోరికతో ఎదుగుతోంది దారిచూపించాలన్న వేదన చీకటిని దాచేయాలన్న తపన వెలుగుకింద అన్ని దాగిపోతాయన్న నమ్మకం అదే దేహంతో దీపం చుట్టూ తిరుగుతూ దీపాన్ని జరిపి చూడగానే నీడ ఆత్మలోకి ఒరిగిపోయిన దీపం నిశ్సబ్ధంగానే వెలుగుతోంది...

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gNqTME

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి