పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఏప్రిల్ 2014, బుధవారం

Kavi Yakoob కవిత

యాకూబ్ | అంత వీజీ కాదు !? .................................... పైకి కన్పించకుండా బిగబట్టుకున్న కోపంతో కూడిన ఇష్టంతో చాలా జాగ్రత్తగా గడిపెస్తుంటాను రోజుని. ఏం ఫర్వాలేదు నీ స్నేహాన్ని వాళ్ళు వంచించారు ;వంచనను స్నేహానికి మరోముఖమని వాళ్ళు తేల్చేసారు . ముఖంపైకి ఒకానొక అనుమానపురాత్రిని విసిరారు. తుడుచుకుంటావో, లోపలికే తీసుకుంటావో నీ ఇష్టం. కలిసి ఉండటం కష్టమే అయినా కలిసే ఉండాలి,తప్పదు. విడిపోవడం ఇష్టమే అయినా ఇష్టాలన్నీ తీరుతాయా అంత వీజీగా ! అంత 'వీజీ'కాదు/అనుకున్నట్లు అన్నీ అలా అయిపోవడం. కన్నీళ్లు ఉంటాయి ,దు:ఖాలుంటాయి ,మెరమెరలాడే సత్యాలుంటాయి అన్నిటినీ వడగట్టి కొంచెంకొంచెంగానే బతుకుని గ్లాసుల్లోకి వొంపుకుంటాం. ఇది కూడా అంతే ! * ఎవరో తలుపులదగ్గర తచ్చట్లాడుతుంటారు సందేహంలో,సందిగ్ధంలో . లోపలికి తోసుకువస్తారో లేదో తెలియదు. కనుక్కోవాలి,అనుసంధానం జరగాలి,సంవాదం జరగాలి, తుప్పుపట్టిన లోపలిని మళ్ళీ సరికొత్తదిగా మార్చాలి. విరిగి,పగిలి,చిరిగి,మిగిలినట్లు మిగిలి చివరికి కొన్నిమాటలుగా మీ ముందుంటాను. విచిత్రం- " ఆకాశంలో వానపాములు పాకుతున్నాయి. భూమ్మీద చుక్కలు దాక్కున్నాయి" [ ఒక ఇంగ్లీష్ సినిమా చూసాక ] *9.4.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n1LdPD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి