పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మార్చి 2014, సోమవారం

Jagadish Yamijala కవిత

అలా ఇలా --------------------- సంగీతంగా ఆస్వాదిద్దాం జీవితాన్ని తీయగానే సాగిపోతుంది ---------------------- వేల భాషలున్నా నా తెలుగు భాషలా అందంగా బిడియపడిన భాష మరేదీ నాకు కనిపించ లేదు ----------------------------- అందంగా ఉంది లాభం లేదు మన మాటలో ప్రేమ కలిసుండాలి --------------------------------- నీ జ్ఞాపకాలను మోయడం వల్ల నా హృదయం గర్భకోశ మైంది -------------------------------- మనం కోపంతో విసిరేసిన ఒక వస్తువు ఎక్కడో అక్కడ ఒకరికి కానుక అవుతోంది --------------------------- పువ్వు కన్నా పవిత్రమైనది వర్షం మనస్సు ---------------------------- నా ఏకాంతం లోనూ నవ్విస్తోంది నీ జ్ఞాపకం -------------------------- తమిళంలో అక్కడక్కడా చదివినవే ఇక్కడ తెలుగులోకి తర్జుమా చేసాను. కానీ మూల రచయితల పేర్లు అందుబాటులో లేకపోవడంతో ఇవ్వలేకపోయాను - యామిజాల జగదీశ్ 10.3.2014 ---------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oF95aW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి