పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మార్చి 2014, బుధవారం

Kapila Ramkumar కవిత

అమ్మ ఫోటో||ప్రసాదమూర్తి మా అమ్మాయి మంచి పనేచేసింది నా సెల్ ఫోన్ లో అమ్మ ఫోటో పెట్టింది. అమ్మను ఎప్పుడు చూసినా... పొత్తిళ్లలో ఉన్నపుడు మా అమ్మాయి నవ్వినట్టే ఉంటుంది. నేనెక్కడికి వెళ్లినా అమ్మ ఫోటో నా చేతుల్లోనే ఉంటుంది పుట్టినప్పుడు నేను అమ్మ చేతుల్లోనే ఉన్నట్లు. ఎవరో తెలిసిన వారో..తెలియని వారో నా జేబులో రింగుమన్నప్పుడు అమ్మ ఒక్కసారిగా వెన్నెల పువ్వై విచ్చుకుంటుంది అమ్మ, ఫోటోలోనే ఉన్నా... ప్రాణమున్న బొమ్మలా నా చేతుల్లోనే ఉన్నట్టు నా శరీరం మొత్తాన్ని అమ్మకు స్తన్యం చేసి ఇస్తున్నట్టు ఏదో తన్మయత్వం ఎక్కడో ఊళ్లో ఉన్న అమ్మను తీసుకొచ్చి నాఒళ్లో పడేసింది మా అమ్మాయి నన్ను గుర్రం చేసి... మా పాప ఆడుకున్నట్టు ఇప్పుడు అమ్మ కూడా నాతో ఆడుకుంటోంది. ఊసుపోనప్పుడల్లా.. ఎందుకెందుకో ఏడుపొచ్చినప్పుడల్లా అమ్మ ఫోటోలో రెండు కళ్లూ రెండు తాళ్లుగా ఉయ్యాల ఊగుతుంటాను. అమ్మను ఫోటోలో చూస్తే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టే. అమ్మ ఫోటోలో నవ్వుతుంటే నేను జీవితంలో ఇవ్వలేని ఆస్తిని నా పిల్లలు అమ్మ ఫోటోని దస్తావేజుగా దాచుకుంటారులే అని ధీమా. నా సెల్ ఫోన్ వాల్ పేపర్ మీద అమ్మ ఫోటోని అతికించి నా బంగారుతల్లి భలేపని చేసింది పిచ్చిది నేనేమైపోతానో అని బెంగ దానికి ఏమైనా జరిగితే అమ్మ బతికించుకుంటుందట. అందుకే ఒక్కమాట చెప్పాలి సమాధులు కడతారో..దహనం చేస్తారో కానీ అమ్మనీ నన్నూ ఒకే ఫోటోలో పెట్టమని చిన్న రిక్వెస్టు. ========== ======== ( నాన్నచెట్టు కవితా సంపుటి నుంచి)

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hJcoO3

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి