పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ// తప్పిపోయిన పిల్లడు// నిన్నొకసారి చూడాలనిపిస్తొంది... ఆకాశం నుండి చినుకులా రాలి తడిసి మట్టి ముద్దగా మారి మట్టిలో దాగిన విత్తు చిగురేసి పచ్చటి కళ్ళతో సూరీడుని మింగి సూరీడు మెరిసిన గొంతులో దూరి మనసుతో మమేకమై చూడాలనిపిస్తొంది. నీతో ఒకసారి మాట్లాడాలనిపిస్తొంది... పూలంటి పెదాలు మలయమారుతంలా కదులుతుంటే మనసు నిండిన మధురోహలతో చిగురిస్తూ పరిమళిస్తూ మాట్టిలో దాగి తలెత్తుకు నిలబడ్డ వేర్లతో పచ్చదనపు పసిడి కనపడగానే అగమ్య బాటసారిలా సోలి నీ నీడతోనైనా మాట్లాడాలనిపిస్తొంది. నిన్నొకసారి ఆలింగనం చేసుకోవాలనిపిస్తొంది... ఉదయం నీరెండ పరుచుకున్నట్టు సంధ్య తరువాయి చీకట్లు విచ్చుకొన్నట్లు వెన్నల వీడలేక తుషార బిందువులై హత్తుకున్నట్టు వెనకాలే అడుగులో అడుగేసుకొంటూ వెంబడిస్తున్నట్లు చేతిలో చెయ్యేసి సుదీరతీరాలు చుట్టినట్టు వెన్నెలే పగలు వెలుతురుగా వ్యక్తమైనట్లు హృదయంలోకి హృదయంలోంచి ఆలింగనం చేసుకోవాలనిపిస్తొంది. నిన్నొక్కసారి వినాలని ఉంది.... వేసంకాల నడినెత్తిన వర్షగీతమై వర్షాకాల మడుగు చివర అడుగుల దారివై శీతాకాలం చేతులు రుద్ది ఆంచిన బుగ్గలవై ఎక్కడ మాయమైపోయావు అని అడగగానే తప్పిపోయిన పిల్లాడల్లే గుక్కపట్టి ఏడుస్తుంటే పక్కన కూర్చుని పకపకా నవ్వుతుంటే వినాలని ఉంది. విని మళ్ళీ నీ ఊహల ఊసులలోనే తప్పిపోవాలని ఉంది, నువ్వు లేని లోకం నుండి తప్పించుకు పోవాలని ఉంది.....16.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dyLOWL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి