పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Nirmalarani Thota కవిత

నడిరేతిరేళ నెత్తిమీదికొచ్చి నవ్వుతావేల ఓ సందమామ . . ! తెల్లారిందంటే తేల కళ్ళేత్తావు నువ్వేమి గొప్ప ఓ సందమామ. . ? పట్ట పగలైనా గాని నా మావ కన్నుల్ల పండు వెన్నెల్లు కురియు ఓ సంద మామ . . ! మిట్ట మధ్యాన్నమేల నడి నెత్తికొచ్చి మిడిసి పడతావేల ఓ సూరీడా . . ? పొద్దు గుంకిందంటే పడమటింట జేరి వెలవెలా బోతావు నువ్వేమి గొప్ప ఓ సూరీడా . . ? నిశి రాతిరేళ నా మావ మోమే కోటి సూరీల్లై వెలుగు ఓ సంద మామ. . ! వానల్లు పడగానే ఎగిరెగిరి పడుతూ . . వగలు పోతావేల ఓ పిల్ల వాగు . . ! ఎండల్లు మండితే ఎండిపోతావు నువ్వేమి గొప్ప ఓ సంద మామ . .! ఏడాది పొడుగునా నా మావ మాటలే ఏరువాకై సాగు ఓ సంద మామ . . ! నిర్మలారాణి తోట [ తేది : 16.02.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kKLvfw

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి