పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Srinivasa Bharadwaj Kishore కవిత

అమెరికాలో అట్లాంటా నగరంలో పరివార సమేతంగా స్థిరనివాసమేర్పరచుకున్న శ్రీనివాసుడు, శివాదుల నుద్దేశించి, ఛందోబద్ధంగా ఒక ధారలాగ వచ్చిన పద్యాలు ఇవిగో నచ్చి ఆనందిస్తే నాకు చెప్పండి. నచ్చకపోతే మరచిపొండి. పలుకుల తల్లికి నివాళి - వలసవచ్చిన దేవతలు రచన: కిభశ్రీ వృత్తం : చంపకమాల IIII UI UIII UII UII UI UI U III IUI UII IUI IUI IUI UIU 1, 11వ అక్షరాలకు యతి మైత్రి పలుకుల తల్లి నీ చరణ ప౦కజముల్ కడ నిల్చియు౦డి నా తలపుల నిన్ను యు౦చగ పదాలవె దొర్లెను గారడీవలెన్ ఖలుడను నాకునీవిధిని కైతలు ధారగ వచ్చెన౦టె నీ చలువనె కాకలేదు పద జాలము వాడెడి ప్రజ్ఞ నాకుగన్ తా:: సరస్వతీ దేవి కటాక్షము లేకుంటే, నాకెక్కడిది ఛందోబద్ధమైన కవిత వ్రాసేంతటి ప్రజ్ఞ సిరిపతి వీడిపాల్కడలి చేరెను ఈదరి రివ్రుడేలునన్ సరియగు సౌతులిర్వురును సంయమునుండిరి చేరి పెన్మిటిన్ నరుడిగ నారదు౦డు హరి నామములే నిరత౦ జపి౦చగన్ తిరిగె విమానమై తనివి దీరగ చుట్టును వైనతేయుడున్ తా:: విష్ణువు, పాలకడలి వదలి రివరుడేలులో వెలుస్తాడు. లక్ష్మీదేవి, ఆమే సవతి(భూదేవి) తో పతిని చేరి వుంటుంది. గరుడుడు జనులను మోసుకుని (airplanes) గోపురవీధులు (గోపురం - ఆకాశాన్నంటుతుంది - గోపురవీధులు - ఆకాశంలో వీధులు) (airplanes hovering around). నారదుడు నరుడిరూపంలో వస్తాడు. శివుడును వీడిపర్వతము సింహిక తోడుగ రాగ ధాత్రికిన్ భవునికి అండనుండగనిభాననుడింకను షణ్ముఖాదులున్ (అండగుండగను ఇభాననుడు) శివునగ నాగరాజుతనె సీ(చీ)కటిబిల్మున దూరె చల్లగన్ శివజటనున్నగ౦గయును శీతలధారల ఛాటహూచయెన్ తా: శివుడు లింగం రూపంలోను, పార్వతి, మోదలగు వారందరూ వస్తారు. శివునగ (శివుని నగ - ఆభరణం ) బిలంలోకి దూరాడు (we have lots of snakes in USA). గంగ (Chatahoochee river - అట్లాంటా జీవనది) దివివిడి ఇ౦ద్ర గ౦ధరువ దేవతలప్సరసాదుల౦దరున్ కవిజన గానకోవిదులు ఖ్యాతిని పొందిన నాట్య తారలై నవవిధ భకి్త భావములు నైగమ శాస్త్రము లన్ని నేర్వగన్ చవియగు మానవాకృతుల చైత్యము కూడిరి పర్వదిన్ములన్ (చవియగు - సరియగు, చైత్యము - గుడి) తా: స్వర్గంనుంచి ఇంద్రుడు మోదలగువారు కవులు, గాయకులు, నాట్యతారలుగ మానవరూపంలో మా వూళ్ళో వెలసినారు. జనులందరూ భక్తులై పూజలు గుళ్ళో చేస్తారు నేను వుండేవూరు - తాలహాసీ. అక్కడ గుడి కట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పైని పద్యాలలో "రివ్రుడేలునన్" ను "తాలహాసినన్" అని, "చాటహూచయెన్" ను "ఓఖ్లఖూనయెన్" అని మార్చి, తాలహాసి కి కూడా అన్వయించుకోవచ్చు......

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ksJXXl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి