పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మే 2014, ఆదివారం

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు -32 . చాలా క్లుప్తంగా, ఎంతో ఆర్ద్రతనిండిన కవిత ఇది. మనం కనిపించని దైవానికి కొన్ని వేలసార్లు మొక్కుతూ, స్తుతిస్తూ, ఇప్పుడున్న స్థితికంటే మెరుగుగా చెయ్యమని వేడుకుంటూ ఉంటాం గాని, మన స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడానికి చలిలో, మంచులో రాత్రనక పగలనక భార్యాబిడ్డలకు దూరమై నిరంతరం సరిహద్దుల్లో బాధపడే సైనికులని తలుచుకోవడంగాని; మనకంటే అధ్వాన్నస్థితిలో ఉండి, చలికీ, ఎండకీ వానకీ రక్షణలేక మగ్గుతున్న దీనులగురించి రాత్రిపడుక్కునేముందు స్మరించుకుని, వాళ్ళకి ఏ ఇబ్బందీ కలగనియ్యవద్దని భగవంతుని ప్రార్థించడంగానీ చెయ్యము. మనగురించే తప్ప ఇతరుల గురించి తలుచుకోని మన అపరాధాన్ని, జీవితంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు గుర్తు చేస్తుంటాయి. మన "లోని మనిషి"ని మేల్కొలుపుతుంటాయి. అలాంటి సంఘటన ఒకటి మనకళ్లముందు చిత్రించేడు కవి. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన ఎడ్వర్డ్ థామస్, ఎక్కువ కాలం పత్రికలలో వ్యాసాలు వ్రాసినా, చివరి మూడునాలుగు సంవత్సరాలూ కవిత్వం వ్రాయడమేగాక, ఆ తరానికి ప్రతినిధిగానూ, తర్వాతి తరానికి మార్గదర్శకుడుగానూ కూడా పేరు సంపాదించేడు. . ఆకలితోనే కొండ దిగేను; ఐతే కడుపు నకనకలాడిపోలేదు; చలిగాలి బాగా వీస్తోంది. అయినా, నా ఒంట్లో ఇంకా ఈ ఉత్తరగాలిని తట్టుకోగల వేడి ఉంది; వొళ్ళు ఎంత అలిసిందంటే ఏ గూట్లోనో తలదాచుకుంటే ఎంతహాయిగా ఉంటుందో చెప్పలేను. . నాకు ఎంత ఆకలిగా, చలిగా, అలసటగా ఉందో తెలుసుగనుక బసలో చలి కాగి, ఆకలితీర్చుకుని విశ్రాంతి తీసుకున్నాను; ఇక బయటి చీకటి ప్రపంచంతో సంపర్కం పూర్తిగా తెగిపోయింది హృదయవిదారకంగా అరుస్తున్న గుడ్లగూబ అరుపుతప్ప. . పాపం! ఆనందాన్నివ్వగల పాట గాని, తగిన కారణంగాని కనిపించక కొండమీద ఒంటరిగా రాత్రల్లా చలిలో ఒణుకుతూ... ఆ రాత్రి నేను బసలోకి చేరుకుని తప్పించుకున్నదీ ఇతరులు తప్పించుకోలేకపోయినదీ చెప్పకనే చెప్పింది. . ఈ చలిలో ఏ ఆనందమూ లేక విశాలమైన ఆకాశం క్రింద రాత్రల్లా మగ్గిన సైనికులూ, నిరుపేదలందరి తరఫునా వినిపించిన ఆ పక్షి పాట, తీర్చుకున్న ఆకలినీ, అలసటనీ వెగటుగా చెయ్యడమే గాక, జ్ఞానోదయాన్ని కలిగించింది.. . ఎడ్వర్డ్ థామస్ 3 March 1878 – 9 April 1917 ఇంగ్లీషు కవీ, సైనికుడూ, విమర్శకుడూ . Edward Thomas (1878 - 1917), English poet and nature writer, c.1905 (Photo credit: Wikipedia) . The Owl . I came, hungry, and yet not starved; Cold, yet had heat within me that was proof Against the North wind; tired, yet so that rest Had seemed the sweetest thing under a roof. . Then at the inn I had food, fire, and rest, Knowing how hungry, cold, and tired was I. All of the night was quite barred out except An owl’s cry, a most melancholy cry . Shaken out long and clear upon the hill, No merry note, nor cause of merriment, But one telling me plain what I escaped And others could not, that night, as in I went. . And salted was my food, and my repose, Salted and sobered, too, by the bird’s voice Speaking for all who lay under the stars, Soldiers and poor, unable to rejoice. . Edward Thomas 3 March 1878 – 9 April 1917 English Poet, Essayist and Soldier (Killed in action in WW-I)

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rPOu5g

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి