పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మే 2014, శుక్రవారం

Lingareddy Kasula కవిత

త్రికాలజ్ఞత|| డా// కాసుల లింగారెడ్డి || 08-05-2014 ఎవరి ఎరుకలో లేకుండానే వర్తమానం గతం గుంటలోకి జారిపోతూవుంటుంది లోలోపలి స్వల్ప భేదాల ఖేదాలు శీతాకాలపు చలికి ఘనీభవించిన మంచుముక్కలా ఉపరితలం మీద హఠాత్తుగా విస్ఫోటిస్తాయి అప్పటిదాకా భ్రమాన్భూతమౌతున్న గాఢానుబంధం అప్రయత్నంగా అపరిచితమైపోతుంది అకాల వర్షపు నీటిలా కాలం చూరులోంచి జారిపోతూవుంటుంది వయసు నీ మీద పడుతుంది అప్పటిదాకా వెలుగుతున్న ఒక కలకూ, నీకూ మధ్య ఒక గోడ మొలుస్తుంది పెరుగుతున్న సాయంత్రపు గోడ నీడలో కల కొడిగట్టిపోతుంది కడలి నీరై కాలం ఆవిరౌతుంది లోతుల్లోకి దిగి వెళ్లబోసుకోవాలనే అనుకుంటవు ఎక్కడా తడి జాడ కనబడదు గాత్రమై విప్పుకోవాలనే గానమై విస్తరించాలనే అనుకుంటవు జలపాతమై పొంగిన గుండె పదనారిపోతుంది ఎండాకాలపు అడవిమంటై కాలం కాలిపోతుంది అప్పుడు, అంగలార్చడానికి ఇంకేమీ మిగులదు ఒట్టి బూడిద తప్ప. డా|| కాసుల లింగారెడ్డి 8 మే2014 సెల్‌: 8897811844

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QlEkNO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి