పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, ఏప్రిల్ 2014, శనివారం

Srinivas Vasudev కవిత

ఈ వారం వింగ్డ్ వర్డ్ ని Jayashree Naidu గారు ప్రెజెంట్ చేస్తున్నారు. జీవితం నిస్సారం అనే సత్యాన్ని కవయిత్రి కమలాదాస్ ఓ కవిత ద్వారా ప్రపంచానికి తెలియజేసే పనే ఈ కవిత Dance of Eunuchs. ఆమె కవితల్లో చాలా పాప్యులర్ ఐన కవిత ఇది. జీవితపు నిస్సారానికి శారీరక నిస్తేజానికీ పెద్ద తేడాలేదని చెప్పే కవిత. ఆ విషయం చెప్పటానికి ఆమె హిజ్రాలని కవితా వస్తువుగా వాడి ఓ గొప్ప కవితని ప్రపంచానికందించారు. ఆ కవిత గురించి జయశ్రీ నాయుడు గారు ఏమంటున్నారో చూద్దాం. అలానే ఆ కవితనీ... 1984 లొ మొట్ట మొదటగా ఒక భారతీయ కవయిత్రి నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చెయ్యబడింది. ఒక విస్తృత సాహితీ పయనాన్ని, జీవితానుభవాల్నీ కథలూ కవితలుగా వ్యక్తీకరించి భారతీయ ఆంగ్ల సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. ఆమెనే కేరళలోని త్రిస్సూర్ లో పుట్టి డెబ్భై అయిదేళ్ళ పూర్ణ జీవితానుభవాల్ని విస్తృత సహిత్య అంశాలుగా వెలువరించిన మళయాళ కథా రచయిత్రి, ఆంగ్ల కవయిత్రి కమలా దాస్. కథల్లోనూ కవితల్లోనూ సామాజిక వర్గంగా స్త్రీలకు ఎదురయ్యే శారీరిక మానసిక భావ సంఘర్షణలు అతి సహజంగా వెలువరించిన ఆమె రచనలకు అప్పటి పాఠక లోకం కొంత ఉలిక్కి పడినా సంబాళించుకుని ఆమె అభివ్యక్తిని అభినందించింది. టైం మాగజైన్ చేత "ఆధునిక ఆంగ్ల భారతీయ కవిత్వానికి మాతృ"సమానురాలిగా (mother of modern English Indian Poetry) ఆమె రచనల్లో The Dance of The Eunuchs అన్నది ఒక విభిన్నమైన రచన. కవిత ఆసాంతం ఒక పాటలా సాగి పోతుంది. మండుటెండలో ఆ నపుంసకులు చేసే నృత్యం లో వారి అలంకరణలోని ధగ ధగలూ, తలలోని పూల సుగంధాలూ, పెదవుల మీద మెరిసే నవ్వులున్నా, వాటి వెనుక వారి విషాద నైరశ్యపు జీవితపు లోతుల్ని కూడా స్పష్టంగా వర్ణిస్తుంది కవయిత్రి....... The Dance of the Eunuchs ------------------------------------ It was hot, so hot, before the eunuchs came To dance, wide skirts going round and round, cymbals Richly clashing, and anklets jingling, jingling Jingling... Beneath the fiery gulmohur, with Long braids flying, dark eyes flashing, they danced and They dance, oh, they danced till they bled... There were green Tattoos on their cheeks, jasmines in their hair, some Were dark and some were almost fair. Their voices Were harsh, their songs melancholy; they sang of Lovers dying and or children left unborn.... Some beat their drums; others beat their sorry breasts And wailed, and writhed in vacant ecstasy. They Were thin in limbs and dry; like half-burnt logs from Funeral pyres, a drought and a rottenness Were in each of them. Even the crows were so Silent on trees, and the children wide-eyed, still; All were watching these poor creatures' convulsions The sky crackled then, thunder came, and lightning And rain, a meagre rain that smelt of dust in Attics and the urine of lizards and mice.... [From Summer in Calcutta]

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q8usUD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి