పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, ఏప్రిల్ 2014, శనివారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మనసులు || ====================== మనసులు అలసి పోయాయి మనుషుల మధ్య ఇమడలేక మధ్యంతరంగా సొమ్మసిల్లిపొయాయి అంతరంగాలు సుడులు తిరుగుతుంటే గుండె కుంపట్ల మధ్య సేద తీరలేక మనసులు పొగలు కక్కుతున్నాయి నలిగిపోయే పాదాలచెంత అరిగిపోయే మనసులు నిత్యం క్షోభకు గురవుతూ ఆవేదనతో అలసిపోయాయి గుప్పెడంత మనసులో ఆకాశమంత కష్టాలు తరిమే మబ్బుల్లా- ఉరిమే ఉరుముల్లా వెంటాడే మెరుపుల్లా వేటాడుతున్నాయి పరిగెట్టలేని మనసు తరాల మధ్య అలసిపోయింది రెండు హృదయాల మధ్య మనో వేదనతో గతి తప్పింది గత గాయాలు గుణ పాఠాలైతే నిత్య అన్వేషణలో నిత్యం గాయాలై అలసిన మనసు రక్తం కక్కుతుంది నవ్వుతున్న మనసు ఇప్పుడు ముఖిలిస్తుంది మనిషి మాత్రం నవ్వుతున్నాడు ఇద్దరి మధ్య అవాంతరాలు కళ్ళల్లో రక్త చారలై కనపడుతున్నాయి పగిలిన హృదయాల మధ్య ముక్కలైన మనసుల మధ్య మది ని మేల్కొలుపుతూ హృదిని రగిలిస్తూ మనసు గాయానికి లేపనం కోసం అన్వేషిస్తున్నా ! ================= ఏప్రిల్ 05/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dY8eTB

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి