పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఏప్రిల్ 2014, గురువారం

Ramakrishna Kalvakunta కవిత

నిరంతరం సాగిపోవాల్సిందే ..... ...................................... ఎంత నడిచినా ,జీవితం చివరి కొస దాకా నడవాల్సిందే పడుతూ,లేస్తూ ,పరవశిస్తూ ,అలిసిపోతూ కలిసిపోతూ ,కరిగిపోతూ ,కదిలిపోతూ .. జ్నాపకాల్ని అతికించుకుంటూ .. నిరంతరం సాగిపోవలసిందే ఎందరు కలిసారో,ఎందరు విడిపోయారో గుండె ఉప్పొంగిన దృశ్య ప్రవాహాలెన్నో ఛిడ్రాల్ని చేసే కుట్రలపరిహాసాలెన్నో మౌనంగా భరిస్తూ ..మమతల్ని కుమ్మరిస్తూ ..నిరంతరం సాగిపోవలసిందే నానా రంగుల ముఖాల నటనలెన్నో అవసరార్థపు కృతక పరిహాసాల వరుసలెన్నో నడుస్తున్నది మనిషేనా ?జీవిస్తున్నది మనసుతోనేనా ? అయినా -జీవించాల్సిందే!-సమన్వయిస్తూ సాగిపోవలసిందే రాలిపడ్డ వెన్నెలల్ని ,కలల చెట్టు రాల్చిన కోర్కెల పూలనీ గుండె సంచీలో భద్రపరుస్తూ ,సమూహంలో ఒంటరిగానైనా మొరటు మనుషుల్ని- మెత్త ని పూలవంతెనలపై నడిపిస్తూ .. కన్నీళ్లలో నానిపోతూ ,ఆగకుండా .....నిరంతరం సాగిపోవలసిందే తడిలేని మనుషుల కరచాలనాలు వెటకారపు మిడిసిపడే నవ్వులు గుండెనెపుడూ ప్రశ్నిస్తూనే ఉంటై మనుషుల్ని కాక మరెవర్ని నమ్మాలి ? కొత్తనెత్తురు ఎక్కించైనా ఆశతో.... నిరంతరం సాగిపోవలసిందే .... కొన్ని ద్రవించే అక్షరాల్నీ ,కొంచెం కన్నీటి తడినీ కవిత్వపు ధాతువునూ పదిలపరుస్తూ ... గుండెలో ప్రాకృతిక సౌందర్య జలపాతాల్ని వొంపుకొంటూ మౌనంగా నన్ను నేను నిత్యం తవ్వుకుంటూ ... మైలు రాళ్లెన్నో దాటుతూ ... నిరంతరం సాగిపోవలసిందే తీరం చేరేదాకా నడవాల్సిందే సారం తెలిసే దాకా సాధన చేయాల్సిందే తెరలు తొలిగే దాకా నటించాల్సిందే శిఖరపుటంచులుముట్టే దాకా పరిగెత్తాలిసిందే మనిషి మట్టయ్యేదాకా .... నిరంతరం విస్తరిస్తూ సాగిపోవలసిందే ! @డా .కలువకుంట రామకృష్ణ .

by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2w0cH

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి