పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఏప్రిల్ 2014, గురువారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ ||| తెల్ల కాగితం |||| ======================== తెల్ల కాగితం ఎదురు చూస్తుంది ఎరుపెక్కే అక్షరాల కోసం పదునెక్కిన రాతల కోసం జీవిత గాధల కోసం నిత్య జనజీవన వ్యధల కోసం కాలే కడుపుల రాతల కోసం ఆకలి పేగు అరుపుల కోసం స్వేధం చిమ్మే కబుర్లు కోసం రక్తం మరిగే అక్షర అంకురాల కోసం తెల్లా(రని )రే బతుకుల కోసం చీకటి జీవితాల రాతల కోసం రాత మారని తల రాతల కోసం నుదిటి గీత లేని అతుకుల బతుకుల కోసం సిరా కక్కే కలం కోసం కలం కక్కే కవిత్వం కోసం తెల్ల కాగితం ఎదురు చూసింది సిరా (లో )ఇంకు పోయింది శూన్యమై వెక్కిరించింది భూతద్దమై వెతికాను సూర్య రశ్మి తోడయ్యింది కాగితం కాలిపోయింది --------------------------- ఏప్రిల్ 03/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mBrKoD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి