పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మార్చి 2014, గురువారం

Jyothirmayi Malla కవిత

(నిన్న విశాఖ సహృదయ సాహితి నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనంలో నా భాగం ఈ గజల్) గజల్ ||జ్యోతిర్మయి మళ్ళ|| నీకోసమె జన్మ అంత గడపలేదా ఆడదీ నీతోడిదె లోకమంటు నడవలేదా ఆడదీ నవ్వుపువ్వులు కురిపించగ నందనమే నీ ఇల్లు బాధలున్న బయటపడక నిలవలేదా ఆడదీ ఇద్దరొక్కటైన క్షణం ధన్యతగా భావించి తనువుమనసు అణువణువు ఇవ్వలేదా ఆడదీ ముల్లుగుచ్చుకుంటె నువ్వు విలవిలలాడుదులే కడుపుచీల్చు బాధనంతా ఓర్చలేదా ఆడదీ సుఖముదుఃఖము ఏదైనా ఒడిదుడుకులు ఎన్నున్నా ఆశ నింపు జ్యోతిగా వెలగలేదా ఆడదీ అమ్మగా అక్కగా ఆలిగా కూతురుగా బ్రతుకంతా ఉగాదిగా మలచలేదా ఆడదీ

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P4qTBx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి