పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మార్చి 2014, మంగళవారం

Gouri Lakshmi Alluri కవిత

క్షణాల శాశ్వతత్వం ============ విడిపోయాం ! నిజమే ! మళ్ళీ కలిసే ప్రసక్తే లేదు ! అదీ నిజమే ! అయితేనేం? మనం స్నేహించిన కాలం లో జీవించాం..గుర్తుందా ? మనం కలిసున్న కాలం ఎంతో కొంత ఉంది కదా ! గంటలో ...రోజులో....నెలలో ... ! నెయ్యంతో పంచుకున్న ఊహలు, ఊసులు పగల బడి నవ్వుకున్న నిమిషాలు... మనసు నలిగినప్పుడు ఓదార్చుకున్న క్షణాలు నేనే నువ్వన్నట్టు, నువ్వే నేనన్నట్టు ఒకరి నొకరు సహానుభూతించిన సందర్భాలు మౌనంగా పక్క పక్కన కూచున్న ఏకాంతాలు నా మనో మందిరంలో అందాల చిత్రాలు అమృతం లాంటి మన సాంగత్యాన్ని గరళం లాంటి నీ నిష్క్రమణాన్ని నా మనసు హంస లా వేరు చేస్తుంది నాటి అద్భుత ఘడియల్ని నెమరేస్తుంది జ్ఞాపకాల పరిమళాల్ని ఆస్వాదిస్తుంది కాల కూటం లాంటి నిర్గమనాన్ని త్యజిస్తుంది చర్విత చర్వణాల పై ఆసక్తి లేదు కా లం చేసిన గాయాలపై అచ్చెరువూ లేదు నిందా, నిష్టూరాలపై అక్కర అసలే లేదు అంతర్లోకంలో ఆ నాటి స్మృతులు నిక్షిప్త నిధులు ఆజన్మాంతం గుండె గదిలో అత్యంత పదిలాలు

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUsSIx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి