పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

అయిపోయిన దానిని మనం మార్చలేనప్పుడు అందరు బాగుండాలని కోరుకుందాం.. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుందాం.. అక్కడా ఇక్కడా అందరూ "మన" వాళ్ళే కాబట్టి "మన" సోదరులు సుఖంగా ఉండాలని ఆశిద్దాం.. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోని కొట్టుకోని శాపాలు పెట్టుకోని మన మద్యన ఉన్న సఖ్యతని పోగొట్టుకోని శత్రువులవకుండా మైత్రీ బంధంలోనే మెలుగుదాం.. తెలుగు వెలుగులను లోకానికి పంచుదాం. తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటుదాం. ప్రాంతాల గోడలు మాకడ్డు కాదంటూ రాజకీయ నాటకాలు నన్నాపలేవంటూ.. నరనరానా నాన్న పంచిన ధైర్యాన్ని దట్టంగా పట్టించి కణకణానా అమ్మ పెట్టిన గోరుముద్దల ఆపేక్షలు అరచేతిన పట్టుకుని సాగుదాం ఎవరూ ఆపలేని ఎవరూ అడ్డుకోని ఆశావహు ప్రపంచంలోకి.. అక్కడ నేనుంటా.. నువ్వుంటావ్.. ఇంకెవరూ ఉండరు.. మనం పంచుకునే తియ్యని తెలుగు మాధుర్యాల మంచు తేనెలు తప్ప.. రా సోదరా.. ఈ కుళ్ళు లోకంలో మనకింక పని లేదు.. మట్టి మట్టిగా మిగిలిపోకముందే మన లోకానికి తెచ్చెయ్.. పసిడి పంట కోతకెళ్ళే లోపు చీడపురుగుల అంతు చూద్దాం. తెలుగు వెలుగులను లోకానికి పంచుదాం. తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటుదాం. - సాట్నా సత్యం

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MbSnU1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి