పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఏప్రిల్ 2014, శనివారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేస్కుమార్ //5ఇంటూ సం వన్// ఏమైందంటావ్ హఠాత్తుగా వాడిప్పుడొచ్చాడు విరిగిన కాళ్ళనీ సంచీలో వేసుకొని ఎర్రని సూర్యున్ని నల్లని రంగుగా వొంటిపై అతికించుకొని తిరిగిన్నాడు ఎమయ్యాడు వాడు ఎప్పటికప్పుడు స్వీయప్రశ్నా పత్రమై నన్నునేనుగా గాల్లోకెగరేసుకున్న నాడు ఏమయ్యాడు వాడు చెట్లకువేళ్ళాడే హృదయాలు ఉదయాలనిండా పరుచుకున్న నాడు నిజాన్ని నినాదం చేసి ఓ పాతగోడపై నేను పరుచుకుంటే..... పాతబస్తీలో మొరిగే. అబద్దపు పోలీసు కుక్కై అరుస్తున్నాడు దేహాంతరపుటాలోచనలు దేశాల దూరంలో ఉండి విన్నాను విన్నానంటూ నోటి చివర కారే లాలాజలపాతమై వాడు నన్ను నిలువునా తడిపేయ జూస్తున్నాడు ఏమయ్యిందంటావ్ హఠాత్తుగా వాడికి నేనొకన్నీ నిలిచిపోతాను కొన్ని గుండెల మద్య సుదూరాలని ఓ సున్నపు గీతలా కలిపేసి శరీరాంతరాత్మల్లో విలీనమై ఒక నీలిరంగు మచ్చని ముద్రగా ఒకానొక నిరసనావాదపు పచ్చ బొట్టు గా చిత్రించి.. నేనూ అప్పుడు నిశ్క్రమిస్తాను బహుశా ఇప్పటిలానే నా వెనకే ఉంటాడు వాడు చీకటిదారుల్లో ఆరిపోయిన లాతరు బుడ్డీ చేతబట్టుకొని పాతబడ్డ చీపురు పైనెక్కి తిరిగి తిరిగీ చివరికి ఒక కరెంటు తీగపై గబ్బిలం లా తలకిందులుగా వేల్లాడుతూ నడుస్తున్న వారిని చూస్తూ...19/4/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qVztjP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి