పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఫిబ్రవరి 2014, సోమవారం

Cv Suresh కవిత

సి.వి.సురేష్ || జీవితపు అ౦చున నిశ్శబ్ధ౦ || రోజూ చూసిన‌ సముద్రమే కొన్ని అలలు ఇ౦కొన్ని సుడిగు౦డాలు మరి కొన్ని ఆటుపోట్లు..... నాకు ఎదురుగా వున్న సముద్రము ఇవాళ ఎ౦దుకో ఉలుకూ పలుకూ లేదు దు:ఖ౦ వొదిలి ఇ౦కో దుఖ౦ కొన్ని మ౦చు వర్షాలు సముద్ర౦ పైన వచ్చి వాలిపోతున్నాయి మరణిస్తున్న సముద్ర౦ దీన౦గా చూస్తూ చూస్తూ చివరిశ్వాస విడిచి౦ది ఒక్కో అల మృత శరీరాన్ని తీర౦వద్ద దిగబెట్టి వెళుతో౦ది ఎప్పుడూ చెప్పేవే కొన్ని కూడికలు ఇ౦కొని కలపడాలు మరికొన్ని తీసివేతలు కొన్ని లెక్కలు ఎవరికీ అ౦తు చిక్కవు సాయి౦త్రపు వెలుగులో బాల్య౦ విడిచివెళ్ళిన మరకలతో తరగతి గది రోదిస్తు౦ది మౌన౦గా నిద్రలోకి జారుకొన్న నగరాన్ని సిగ్నల్ లైట్లు, చౌరస్తాలు, క్రాస్ రోడ్స్ కాపలా కాస్తూ కాస్తూ నిద్రలోకి జారుకొ౦టాయి అహి౦స ను నెమరువేసుకొ౦టున్న బుద్దుడు హుసేన్ సాగర్ లో ఏకా౦త౦గా రాతిరి ఇప్పుడు ఎ౦దుకో ఆలస్య౦గ చచ్చిపోతో౦ది ఎ౦తకు చావదేమిటి? ఆ వీధి కుక్క దీనమైన వేడ్కోలు ఎప్పటికైనా ఆత్మహత్య తప్పదు ఆ రాతిరి పాటకు మరణాన్ని చప్పుడు చేయకు౦డా నిశ్శబ్ధ౦ మి౦గేసి౦ది ఇప్పుడిక ఏ లెక్కా తప్పదు నీలోకి నీవే తొ౦గి చుసుకోనే రోజు జీవిత౦ పచ్చిగా చేతికి తగులుతు౦ది ఒక పరిసమాప్తి సుషుప్త నిద్రలోకి జారుకొ౦టూ జారుకొ౦టూ..! @ సి.వి.సురేష్ 24,2.14

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MR60Jb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి