పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మే 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్/అక్షరం ఈరోజు అక్షరాలన్నీ చిన్నబోయాయి స్వచ్చమైన పదాల అల్లికలో విఫలమై అనేక కలాలు పదే పదే కాగితం పొలంలో శ్రమిస్తున్నా దాహం తీరక నిర్లిప్తమయినాయి ఎందరి జీవితాల్లో హస్తవాచికలయ్యాయో తమ రూపాన్నీ చాటడం కోసం పేర్చిన పదాలలో ఒద్దిక కరువైనప్పుడల్లా నిశ్శబ్దంగానే రోదిస్తూ వెన్నెల వాకిళ్ళలో తేలినప్పుడల్లా వేదనసంద్రంలో మునకలు వేసినా తోడొస్తూనే ఉన్నాయి నిష్కల్మషమైన చేతిచూరులో ఎప్పుడూ అద్దుకునే ఉంటాయి అర్థాలహాయిని మోస్తూ కొన్నిసార్లు ప్రేమగా మరికొన్నిసార్లు దుఖంగా ఆర్ద్రథగా ఆవేదనగా ఆవేశంగా పరివర్తించుకుంటూనే ఉన్నాయి కొత్త పదాలను జనియిస్తూనే కలివిడివేళ్ళు దొరికినప్పుడల్లా కాదీ అక్షరం అంతం మళ్ళీ రూపాంతరం మాత్రమే తిలక్ బొమ్మరాజు 01.05.14 07.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1oDlw

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి