పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, మార్చి 2014, సోమవారం

Srinivasu Gaddapati కవిత

చెప్పులు ----------------- హిందీ మూలం- ఓంప్రకాశ్ వాల్మీకీ స్వేచ్ఛానువాదం - శ్రీనివాసుగద్దపాటి ------------------------------------------------------------ ద్వేషపూరితపదాలు నా శరరంలో సూదుల్లా గుచ్చుకుంటాయ్ అప్పుడు వారంటారు మా వెంట రావాలంటే అడుగుముందుకెయ్ త్వరగా.. త్వరగా కానీ....నాకు అడుగు ముందుకేయడమంటే... పర్వతాన్ని అధిరోహించినట్లే నావి గాయపడ్డ పాదాలు తెగిన చెప్పులు వారు మళ్ళీ అంటారు వెంట రావాలంటే.. అడుగుముందుకేయ్ మా వెనుకే నడువ్ నేనంటాను కాళ్ళలో బాధగా ఉంది నడవటం నావల్లకావటంలేదు చెప్పులు బాధపెడుతున్నాయ్ అప్పుడు వారు అరుస్తారు అగ్నిలో పడేయ్ నువ్వు- నీ చెప్పులూనూ... నేనిలా చెప్పాలను కుంటాను అగ్నిలో కాదు మంటల్లో జీవిస్తున్నానని క్షణం క్షణం చస్తూ ఉన్నా చెప్పులు నన్ను గాయపరుస్తున్నాయ్ ఆ బాధ నాకే తెలుసు నీ గొప్పదనం నాకు నల్లని చీకటే వారు నగిషీలు చెక్కి మెరుస్తున్న ఆ కర్రతో నన్నదిలిస్తూ.....ముందుకెళ్తారు నాకు తెలుసు నా బాధ మీకు చిన్నదే అనిపిస్తుంది మరి మీబాధేమో కొండలా అనిపిస్తుంది అందుకే .. నీకూ నాకూ మధ్య ఒకదూరం దాని పొడవు నేను కాదు కాలమే కొలుస్తుంది 03.03.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kO0UsG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి