పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। నాలో నువ్వు ।। -------------------- గుండె గోడలను చీల్చుకుని చొచ్చుకుపోయావు కొంత మాంసం ముద్దకు కొన్ని ఎముకులను అతికించి నువ్వే ఈ దేహాన్ని నిర్మించినట్టు. ఇక నాదంటూ ఏమీ లేదు ప్రతి అణువూ నీ పరిబ్రమణమే ప్రతి కణమూ నీ వశమే. ఉచ్వాస నిశ్వాసలు నీ స్పర్శకు రగులుతూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాయి లిప్తపాటు మరణానికి కొత్త ఆయుష్షు పోసుకుని. హృదయాన్ని కోట్ల శకలాలు చేసి విసిరేస్తున్నావు అవి మంచు పొగుల్లొ పడి ఆరని జ్వాలగా రగులుతున్నాయి. రాలి పడుతున్న రాత్రులు నక్షత్రాల బరువులు మోసుకొచ్చి గుండె బాధను పెంచి పోతున్నాయి. యాతమేసి తోడుతున్నా ఆరని కన్నీటి సముద్రాలు స్రవిస్తూనే వున్నాయి కట్టలు తెంచుకున్న ఉప్పెనలా. ఇది ఆది యో .. అంతమో .. అనంతమో .. ! (26-022014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evcNOE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి