పేజీలు

16, జూన్ 2014, సోమవారం

Sharada Sivapurapu కవిత

లెక్కలు...లెక్కలు...లెక్కలు // శారద శివపురపు లెక్కలు లెక్కలు లెక్కలు ఎక్కడికక్కడ లెక్కలు ఎప్పటికప్పుడు లెక్కలు కూడికలు,తీసివేతలు,విభజనలు, బతుకు రైలు పట్టాలు తప్పించే లెక్కలు ఇచ్చి పుచ్చుకునేందుకు లెక్కలు పుచ్చుకు ఇచ్చుకునేందుకు లెక్కలు మన సైనా, మను వైనా, చా వైనా నా, బతు కైనా ఆడా మగలకు వేరు వేరు లెక్కలు అందాల తారల లెక్కలు అందరినలరించే లెక్కలు శరీరానికి తీసివేతలే లెక్క (ఆ) భరణానికి కూడికలే లెక్క పిల్లవాడు తప్పితే లెక్క మాస్టారి చే త్తో ఓ దెబ్బ పెద్దవాడు తప్పితే లెక్క తీరునులే జీవితపు కక్ష్య ఒంటరితనం ఒకటే లెక్కయితే పదిమందికి వంద లెక్కలు ఆ స్తుల లెక్కలు, అప్పుల లెక్కలు జన్మ, జన్మకో తికమక లెక్కలు ఎక్కువ తక్కువ లెక్కలు వి స్తీర్ణాలు, వైశాల్యాలు, ప్రపంచీకరణ నేపధ్యంలో రెక్కలొచ్చిన లెక్కలు దేముడూ, దెయ్యమూ, ఆధ్యాత్మికం సామాన్యులకందని మాయ లెక్కలు కనపడని దేముడి విలువ కోట్లల్లో కొలుచువాడి విలువెపుడూ సున్నాల్లో కాలమనేది ఎవ్వరికందని లెక్కయితే కాలంతో మారేవి మరికొన్ని లెక్కలులే అమ్మ ప్రేమకీ, నాన్న ఆప్యాయతకీ కొన్ని చెప్పలేని లెక్కలున్నాయిలే లెక్కలే ఒక రోగమయితే నిన్ను లెక్కచేయని రోగమొ స్తే తాన తందానా, డాక్టరుదే లెక్కలే మింగలేక కక్కినా, కక్కలేక మింగినా ఆ లెక్కకిక తిరుగు లేదులే ఎన్ని లెక్కలు వేస్కున్నా నీ లెక్క తప్పిన రోజున అన్ని లెక్కలూ తారుమారే అయినా ఒక లెక్క మాత్రం అదే...... ఆరడుగుల లెక్క అది ఎన్నటికీ తప్పదులే . 16/06/2014

by Sharada Sivapurapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U1Vbro

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి