పేజీలు

20, జూన్ 2014, శుక్రవారం

Nvn Chary కవిత

మధ్య తరగతి మందహాసం డా . ఎన్.వి.ఎన్.చారి 1990 లో మేం గౌతమి నవ్యసాహితి ,చర్ల ద్వారా తీసిన నవస్వరాలు సంకలనం నుండీ నా కవిత 20-06-2014 ఆకాశం మేఘావృత్తం నా మనస్సు చింతాక్రాంతమ్ గొంతు చించుకొనేడుస్తుంది ఆకాశం గొంతెండి మౌనంగా రోదిస్తోంది నా మానసం ! నెలసరి జీతం దిన వెచ్చాల కమ్ముడు పోగా ఎమ్ప్టీ పర్సు ఏంటీ అని వెక్కిరిస్తోంది డబ్బులేనివాడికి పర్సెందుకన్నట్లు బ్లాక్ మెయిల్ చేస్తోంది ఎప్పుడో జారిపోతానని అందుకే నా హృదయం వ్యధా భరితం ! పక్కింటి పెక్కింటిని చూచి నాలోసగం నాపై అలిగింది పిల్లల వలువలకీ , చదువులకీ ఇంటిలోని గోల్డునంతా తాకట్టు పత్రాలు తినేసాయి ఉన్నొక్క ఇంటిని చూసినప్పుడల్లా మూడో అమ్మాయి పెల్లెప్పుడంటోంది అందు కే నా మది శోకపు నది ! ఈ పండుగలొకటి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు మా దశమ గ్రహాలిద్దరికీ తిండికే వంద నోటప్పు తెచ్చినవాణ్ణి కానుకలంటే తలెక్కడ తాకట్టుపెట్టనూ అందుకే నామనస్సుకు లేదు ఉషస్సు ఇంటిచుట్టు అప్పులు ఆఫీసులో అప్పులు ఎటుచూసినా అప్పుల కుప్పలు ముళ్ళపూడి అప్పారావుని నేనే నేమో నన్న భ్రాంతి కనిపించిన ప్రతి వాన్నీ తప్పించుకు తిరుగువాన్ని కనిపెంచిన పెద్దలకు తిండిపెట్టలేని అశక్తున్ని అందుకే నాచిత్తం ఒక చింతల పొత్తం ! చావు కూడా నాకు శత్రువే రమ్మంటే దూరంగా పోతోంది అనారోగ్యం మాత్రం భయపడకు నేనున్నానంటోంది అందుకే ఈ మధ్య తరగతి మది అనంత దుర్భర దు:ఖ జలధి

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1if4JdL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి