పేజీలు

18, జూన్ 2014, బుధవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //అనేకాంతం// ఎక్కడ బయల్దేరావో అక్కడికే చేరుకునే భూమ్మీద ఎంత దూరం వెల్లగలం నువ్వైనా,నేనైనా, మనం కనే ఒక కలైనా గరిమ నాభి చూట్టూ. వలయాలు గా చుట్టుకునే కాలమైనా... మనచేతినుంచి జారిపడిపోయిన ఒకానొక యవ్వనపు చిరునవ్వు ఏ పుస్తకపు పుటలమధ్యనో గులాబీ రేకలా దాచిపెట్టబడే ఉండవచ్చు వేరెవరో తమ మొహం పై అతికించుకొని నిన్నూ స్వప్నించవచ్చు అనుకుంటూ ఒక్కడిగా ఉంటూనే అనేకులు గా మారిపోతూంటాం మెల్ల మెల్లగా పక్కకు ప్రవహిస్తూ మనిషులనుంచి కాస్త దూరం జరుగుతానా పరుగెత్తుకు వచ్చి నాలోకి లోలోపలికి దూకి మునుగీత వేస్తాడొకడు అట్టడుగుకి జారిపోయిన గుండెని స్పృశించి కాస్త రక్తాన్ని నింపుతాడు నిశ్శబ్ద ఉద్యానవనపు బెంచీ లానో ఒంటరి రైల్వే ఫ్లాట్ఫారమ్మీది సిమెంటు చెప్టాలానో కూర్చున్న నన్ను అచ్చంగా నాలానేఉన్న మరొకడు నిలువెల్లా కావలించుకొని వాడి కళ్ళలోంచి వొలికే కాస్త నిద్రని నాకూ పంచుతాడు..... ఊక్కొక్క అడుగుగా ప్రయాణాలని పేర్చుకుంటూ సమూహాలుగా సాగుతూ వెలుతున్న వాళ్ళు తమ స్వరాల దీపాలని మార్మిక గీతాలుగా గాలితెమ్మెరలకు వేళ్ళాడదీసి నిన్నూ నన్నూ తమ సంతకాలుగా మరికొందరి హృదయాలపై ముద్రించి వెళ్ళిపొయారు... ఇంక ఒంటరిగా ఎలా ఉండగలం నువ్వైనా నేనైనా మనం ఉండగా ఆ మందిరపు మూడవ మెట్టు మీది బిచ్చగాడైనా.. 18/06/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pieTe2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి