పేజీలు

18, జూన్ 2014, బుధవారం

Kurella Swamy కవిత

కూరెళ్ళ స్వామి // సాయంత్రపు ఉదయం // నేనస్తమిస్తూ ఉంటాను నన్ను నేను ఉదయించుకునేందుకు వర్షాకాలం మబ్బుల వెనక కనిపించకుండా పారిపోయి పశ్చిమాన వాలిపోయిన సూర్యునిలా నా జీవిత ప్రయాణంలో నేను అదృశ్యమయ్యి మరెవరి ప్రయాణాన్నో కొనసాగిస్తూ ప్రియురాలి/ప్రియుని కి రాసిన ప్రేమలేఖకు ప్రేమలేక తను ఇవ్వని సమాధానాన్ని, మౌనాన్ని అంగీకారమనుకొని భ్రమల్లో తెలియాడి నిజం తెలిశాక రాలిన కన్నీటి చుక్కలా ప్రేమించడానికి, ప్రేమపొందడానికి మధ్యన ఉన్న సన్నని గీతను గుర్తించకుండా "అస్తమించడమే ఉంది ఇందులో మరి ఉదయించడమేది ?" అని అడుగుతావేమో మిగిలిన కొన్ని క్షణాలు హక్కుల కోసం కొట్లాడి అలసి పగిలిన ఏవో కొన్ని హృదయాలు సలిపే పోరాటంలో నా వంతుగా భాగమవుతాను ఇంకేమైనా ఒకటీ అరా క్షణం కొసరుగా దొరికితే నన్ను నన్నుగా గుర్తించేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ప్రచారం చేస్తూ వాటి సాధనోధ్యమంలో భాగస్వామినవుతాను నన్ను నేను మోసం చేసుకుంటూ ఉంటాను ఇతరులను మోసం చేయలేక నేనెవరని పదే పదే నీవూ , నేను వేసిన ప్రశ్నలకు సమాధానాల శోధనలో జరిగిన ఒక్కో ఘట్టం ఒక జ్ఞాపకమై వెంట వస్తుంటే నిన్నూ , జ్ఞాపకాలను మర్చిపోయినట్టు నటిస్తూ పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచం నా సొంతమై నేనేదో ఒక రాజ్యానికి నిరంకుశ ప్రభువునయ్యాననే భ్రమలో అధికారపు అహంకారం లో మమకారాలను మర్చిపోయి ప్రజను కూడా నేనే అనే సంగతిని మర్చిపోయి "నిన్ను నీవు పోగడుకుంటూ అధికార దాహాన్ని తీర్చుకుంటూ ఇతరులపై ప్రేమను ఒలకబోస్తున్నట్టు నటిస్తున్నావేం తమాషాగా ఉందా ? " అని కోప్పడతావేమో ఇంత సువిశాల ప్రపంచంలో ఇతరులెవరు ? అందరూ నేనే అంతటా నేనే నీవూ, నేను అందరం నేనే నన్ను నేను మోసం చేసుకోలేకే నన్ను నేను మోసం చేసుకుంటున్నానన్నమాట నన్ను నేను హత్యించుకుంటాను బానిస సంకెళ్ళతో మనిషిగా పుట్టడం నేరమని తెలిశాక సృష్టిధర్మం అనే ఒక పదబంధాన్ని సృష్టించుకుని పైవారికి కిందివారు బానిసలనే ఒక స్మృతిని రాసుకుని సృష్టిలోని ప్రతి సౌందర్యాన్ని నా బానిసత్వంతోనే స్పృశించుకుంటూ వేల సంవత్సరాల చరిత్రను మాటల్లో చెప్పలేని అణచివేతను ఇంకా మోస్తున్నందుకు ఇంకా సంకెళ్ళను తెంపుకోనందుకు మనిషితనాన్ని బ్రతికించట్లేనందుకు "మరణిస్తావు, చంపుకుంటావు సరే ఆత్మహత్య మహా పాతకం తెలుసా ? నువ్వు సభ్యసమాజం ముందు దోషిగా నిలబడాలి ఎరుకేనా ? " అని ఎదురు ప్రశ్నిస్తావేమో నేనంటే శరీరమనే ఎందుకనుకుంటున్నావ్ ? ప్రాణాన్ని తీస్తేనే పాపం ,శిక్ష నేనంటే నా అహం నా బానిసత్వం నా అజ్ఞానం నాలోని అవివేకం........ - Kurella Swamy (18/06/2014)

by Kurella Swamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lTWi73

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి