పేజీలు

16, జూన్ 2014, సోమవారం

Kurella Swamy కవిత

కూరెళ్ళ స్వామి // మన కాలపు కాలాలు // ఏకాలం ముందొ, ఏ కాలం ఎన్కనొ ఎర్కలేక మేం ఎద్గుతప్పుడు అన్ని కాలాలు మాకందంగ గనవడి అందరొక్కటని ఆనందాన్నిస్తుంటె ఎండకాలమొస్తే గొటీల ఆట సూటెక్కువొవనికుందో సూద్దామనుకుంట "పీచా సామా" పస్టైతే శెప్పని పండ్లు గొరికేది శెప్పిందానికే లగ్గయి సగం దొబ్బినంక ఆట మజ్జెల అవ్తలోడు ఆగమైపోతుంటే ఖల్లాసా అనేది ఎక్కిరిచ్చుకుంట ఒక్క గోటి మిగిలి బొద్ధి దొవ్వినంక ఒక్కలిద్ధరముంటే జాన బెత్తలు ఆడి ఏల్లు ఇరిశేది మందెక్కువైతే మంచిగయింధనుకుంట రాజు రాణి ఆట పంచుకుని ఆడేది ఆటాడి అల్శల్షి ఇంట్లకొచ్చి అన్నం దిన్నంక ఎటాడే మనుసులమై షికార్కుకు బోయేది తాటి ముంజలు , సాపలు సరిపోను దొర్కినంక ముర్సుకుంట మూటగట్టి ఒడ్డుకు బెట్టి ఒగలెంక ఒగలు బాయిల డై గొట్టుకుంట దుంకేది అర్ధ గంట కాన్నించి ఆరుగంటలయితే గంత ఆల్చమైన గాని అడ్గుతోల్లు గాకుండె అమ్మయ్య.......... ఆనకాలమొస్తే మేము బుర్రిగోనాటంటె అయ్యనేది గది శిర్రగోనాటని ఏదోటి ఇహ పోయే బుర్రి శెక్కియ్యమంటె జామ కట్టె కామ గొడ్డలి దెబ్బకు కంపాకు శెట్టు కాల్లిర్గబడేది ఆనలనే తడ్షితడ్షి పడిశం బడుతున్న శిటికీల ఆటల గడిగడికి ఓడి గుండంల బుర్రిని గురిసూశి ఇశిరేది ఆన నీళ్ళకు కాలువలు జేషి పొలాలు ఒరాలు పచ్చి మట్టితొ గట్టి అనుకున్న తీర్గ అంతటా పారిచ్చి ఆనకాలం పంట అరగంటల పండిచ్చి కండ్లార పొలాన్ని పచ్చగా సూశేది కాయితం పడవల కాలం శెల్లిపోతే ఎర్రలను బట్కొని సాపలకు సావును దాశిపెట్టేది.......... సలి కాలమొస్తే సద్దురొనుక్కుంటనుకుంట ఎవలెవలు లేశినా ఎయిల్లిమారంగ ఎండపొడగొట్టే మొదుగాల ఏం గాదనుకుంట రుమాలు శెదర్లు దూరంగ ఇశిరేశి కట్టెపుల్లల మంటకు సలిగాగుతుండేది ఆటలేమున్నా పాటలేమున్నా ఐదారు గాకముందే శీకటయితుంటె పదిగోట్టక ముందే ఊరు పండుకునేది పొద్దూక ఆటలు పొయ్యికాడ ఆడేది నిద్దురొచ్చేదాక ఒక్క తాడనే కద్లక కూసునేది సలికాలమది పుండైతే సచ్చినా మాందని తట్రాయి దాకిన గాని తక్కువైద్దో గాదోని ఆగమాగమయ్యేది ఉడుగ్గంజే బాగుండే ఉన్న కూరలల్ల అడ్గందే బెడ్తుండే మాయమ్మ కూరెల్లెల్లమ్మ........ -Kurella Swamy (16/06/2014)

by Kurella Swamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qVbh0K

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి